ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన (Huawei) మరోసారి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని తన కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌ను ప్రకటించింది. కంపెనీ ప్రకటన ప్రకారం Huawei Pura 90 Pro, Huawei Pura 90 Pro Max మోడళ్లు 2026 ఏప్రిల్ 20న చైనా మార్కెట్‌లో విడుదల కానున్నాయి. ఇప్పటికే ప్రీ-బుకింగ్స్ ప్రారంభమవడంతో టెక్ ప్రియుల్లో ఈ ఫోన్లపై భారీ ఆసక్తి నెలకొంది.
లాంచ్‌కు ముందే కంపెనీ ఈ సిరీస్ డిజైన్‌ను టీజ్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కొత్త Pura 90 సిరీస్‌లో గ్రాడియెంట్ ఫినిషింగ్‌తో బోల్డ్, ఆకర్షణీయమైన డిజైన్ కనిపిస్తోంది. గతంలో (Huawei) P20, P30 సిరీస్‌లలో కనిపించిన ట్రెండీ డిజైన్‌ను ఆధునిక టచ్‌తో మళ్లీ తీసుకువచ్చింది. క్లాసిక్ బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో కూడా ఈ ఫోన్లు అందుబాటులో ఉండనున్నాయి.
డిజైన్ పరంగా ఈ సిరీస్‌లో వెనుక భాగంలో రౌండెడ్ ట్రయాంగిల్ ఆకారంలో ఉన్న కెమెరా మాడ్యూల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఫ్లాట్ ఎడ్జెస్, స్లిమ్ బాడీ, ప్రీమియం మెటీరియల్స్ వాడకం వల్ల హ్యాండ్ ఫీల్ కూడా అత్యుత్తమంగా ఉండేలా డిజైన్ చేశారు.
పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్లలో Kirin 9030 లేదా Kirin 9030 Pro చిప్‌సెట్ ఉండే అవకాశం ఉంది. HarmonyOS 6.1 ఆధారంగా పనిచేసే ఈ డివైజ్‌లు స్మూత్, ఫాస్ట్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని అంచనా. మల్టీటాస్కింగ్, గేమింగ్, హెవీ యాప్స్ వినియోగంలో మంచి పనితీరు ఇస్తాయి.
Huawei ఈసారి “HyperSpace Memory” అనే కొత్త టెక్నాలజీని పరిచయం చేస్తోంది. దీని ద్వారా 16GB RAM ఉన్న ఫోన్ కూడా 20GB వరకు వర్చువల్ పనితీరును అందించగలదని కంపెనీ పేర్కొంది. ఇది హై-ఎండ్ యూజర్లకు ప్రత్యేక ప్రయోజనం కలిగించే ఫీచర్‌గా భావిస్తున్నారు.
కెమెరా విభాగంలో ఈ సిరీస్ ప్రత్యేకంగా నిలవనుంది. రెండో తరం “Maple Imaging System”తో పాటు 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ ఉండే అవకాశముంది. దీని వల్ల జూమ్ ఫోటోగ్రఫీ, నైట్ ఫోటోగ్రఫీ, హై డీటైల్ ఇమేజింగ్ మెరుగుపడే అవకాశముంది. AI ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్, వీడియో స్టెబిలైజేషన్ వంటి ఫీచర్లు కూడా ఉండే అవకాశముంది.
బ్యాటరీ మరియు ఛార్జింగ్ విషయంలో కూడా ఈ ఫోన్లు ఆకట్టుకునేలా ఉంటాయని తెలుస్తోంది. ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండొచ్చు. అదనంగా IP రేటింగ్, ఫేస్ అన్‌లాక్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ వంటి సెక్యూరిటీ ఫీచర్లు కూడా ఉండే అవకాశముంది.
ధర వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, ఈ సిరీస్ ప్రీమియం సెగ్మెంట్‌లోనే ఉండనుంది. త్వరలోనే గ్లోబల్ మార్కెట్‌లో కూడా విడుదల చేసే అవకాశముందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Also read:
