MSDhoni: “నా బాడీ సహకరించడం లేదు”

MSDhoni

MSDhoni

Mahendra Singh Dhoni (MSDhoni) చేసిన తాజా వ్యాఖ్యలు Chennai Super Kings అభిమానుల్లో చర్చకు దారితీశాయి. “2027 ఐపీఎల్ ఆడుతావా?” అంటూ మాజీ క్రికెటర్ Suresh Raina అడిగిన ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

చెన్నైలోని M. A. Chidambaram Stadiumలో సీఎస్‌కే చివరి మ్యాచ్ సందర్భంగా ధోనీ అభిమానులను కలిశాడు. మ్యాచ్ అనంతరం గ్రౌండ్ చుట్టూ ల్యాప్ ఆఫ్ హానర్ చేస్తూ అభిమానులకు అభివాదం తెలిపాడు. ఈ సమయంలో స్టేడియం మొత్తం “ధోనీ… ధోనీ…” నినాదాలతో మార్మోగింది.

IPL 2024: MS Dhoni To Not Captain Chennai Super Kings This Season, IPL's  Shocking Revelation – News24

అయితే అభిమానుల ఆనందం మధ్య ధోనీ (MSDhoni) చేసిన వ్యాఖ్యలు నిరాశ కలిగించాయి. “నా బాడీ ఇప్పుడు అంతగా సహకరించడం లేదు” అంటూ ధోనీ చెప్పిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలతో అతని భవిష్యత్‌పై మళ్లీ రిటైర్మెంట్ చర్చ మొదలైంది.

ఈ సీజన్‌లో ధోనీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం ఇప్పటికే అభిమానులను నిరాశపరిచింది. గాయాలు, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు పూర్తిస్థాయిలో మైదానంలో కనిపించలేకపోయాడు. అయినప్పటికీ చెపాక్‌లో అభిమానులను కలిసేందుకు రావడంతో స్టేడియంలో ప్రత్యేక వాతావరణం కనిపించింది.

MS Dhoni ruled out of IPL 2026? Concerning 'only jogging' update leaves CSK  shocked

సురేశ్ రైనా సరదాగా అడిగిన ప్రశ్నకు ధోనీ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొందరు అభిమానులు “ధోనీ ఇక ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పే సమయం దగ్గరపడింది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అతడు మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని ఆశిస్తున్నారు.

ధోనీ ఐపీఎల్ కెరీర్ గురించి అభిమానుల్లో ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. సీఎస్‌కేను ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టిన కెప్టెన్‌గా అతడు అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. అందుకే అతని ప్రతి వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ధోనీ భవిష్యత్‌పై స్పష్టత లేకపోయినా, చెపాక్‌లో అభిమానులకు చేసిన అభివాదం మాత్రం భావోద్వేగ క్షణంగా నిలిచిపోయింది.

Also rfead: