ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల, లంకమల, శేషాచలం అటవీ ప్రాంతాలు మరోసారి చరిత్ర ప్రేమికుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. దట్టమైన అడవుల మధ్య శతాబ్దాల నాటి చారిత్రక సంపదను వెలికితీసే లక్ష్యంతో భారత (Archaeology) పురావస్తు శాఖ (ఏఎస్ఐ) విస్తృత సర్వేలు నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో కొనసాగుతున్న ఈ పరిశోధనల్లో ఎన్నో విలువైన చారిత్రక ఆధారాలు బయటపడుతున్నాయి. మైసూర్ ఆర్కియాలజీ జాయింట్ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి, తిరుపతి ఎంపీ Gurumoorthy Madhila నేతృత్వంలో ఈ అన్వేషణ కొనసాగుతోంది.
శేషాచలం అడవుల్లోని సదాశివకోన ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో 16వ శతాబ్దానికి చెందిన విజయనగర సామ్రాజ్య కాలం నాటి అరుదైన శాసనాలు గుర్తించారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల ప్రాచీన లిపుల్లో చెక్కబడిన ఈ శాసనాలు చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యం కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా 1471 సంవత్సరానికి చెందిన ఒక శాసనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ శాసనాల్లో ప్రాచీనమైన Gudimallam Sri Parasurameswara Swamy Temple ఆలయానికి సంబంధించిన విశేషాలు నమోదు అయ్యాయి. ఆలయంలో జరిగే నిత్య పూజలు, నైవేద్యాలు, రాజులు చేసిన భూదానాలు, ఆలయ నిర్వహణకు సంబంధించిన వివరాలు శాసనాల్లో లభించాయి. అదేవిధంగా సదాశివకోన పుష్కరిణి నిర్మాణం, పరమశివుడు ఉగ్రతాండవం చేస్తున్న శిల్ప రూపాలు కూడా ఈ శిలాశాసనాల్లో కనిపించడం విశేషంగా భావిస్తున్నారు.

మరోవైపు నల్లమల అడవుల్లో నిర్వహించిన సర్వేల్లో మొత్తం 38 చారిత్రక శాసనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ శాసనాల ఆధారంగా Srisailam Mallikarjuna Swamy Temple ఆలయం తొలి శతాబ్దానికి ముందే ఉనికిలో ఉన్నట్లు పురావస్తు నిపుణులు పేర్కొంటున్నారు. పల్లవులు, కాకతీయులు, విజయనగర రాజులు ఆలయ అభివృద్ధికి చేసిన కృషిపై కూడా కీలక సమాచారం లభించింది.
ప్రత్యేకంగా Sri Krishnadevaraya మరియు Chhatrapati Shivaji Maharaj శ్రీశైలాన్ని దర్శించినట్లు శాసనాల్లో నమోదైన వివరాలు చరిత్ర పరిశోధకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే రెండో శతాబ్దానికి చెందిన శాతవాహనుల పాలనకు సంబంధించిన ఆధారాలు, ఆదిమానవుల నివాసాల ఆనవాళ్లు కూడా బయటపడినట్లు అధికారులు వెల్లడించారు.
దేశ చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను భద్రపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “భారత్ శ్రీ” ప్రాజెక్ట్‌లో భాగంగా ఈ శాసనాలను డిజిటలైజ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 86 వేలకుపైగా ప్రాచీన శాసనాలను గుర్తించినట్లు ఏఎస్ఐ వెల్లడించింది. భవిష్యత్తులో పరిశోధకులు, విద్యార్థులు, సాధారణ ప్రజలకు ఈ (Archaeology) చారిత్రక సమాచారాన్ని అందుబాటులో ఉంచేందుకు “భారత్ శ్రీ” పోర్టల్‌లో అప్‌లోడ్ చేయనున్నారు.
ఇక ఈ చారిత్రక ప్రదేశాలను ఎకో టూరిజం కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంతో చరిత్ర, ప్రకృతి, పర్యాటక రంగాలకు కొత్త ఊపు లభించే అవకాశం కనిపిస్తోంది.
Also read:
