EPFO: ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి.

EPFO

EPFO

(EPFO) ఈపీఎఫ్ఓ సభ్యులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కలిగించే మార్పులు తీసుకొచ్చింది. కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించిన వివరాల ప్రకారం, ఈపీఎఫ్ఓ ఐటీ వ్యవస్థను పూర్తిగా సెంట్రలైజ్డ్ చేయడంతో దేశవ్యాప్తంగా ఉన్న సభ్యుల రికార్డులు ఇప్పుడు ఒకే జాతీయ డేటాబేస్‌లో అందుబాటులోకి వచ్చాయి. దీని వల్ల పీఎఫ్ క్లెయిమ్స్, వడ్డీ జమ, పెన్షన్ సేవలు మరింత వేగంగా అందనున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీని (EPFO) ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేయనుంది. జూలై 15 నాటికి కోట్లాది మంది సభ్యులకు ఈ వడ్డీ చేరేలా ఏర్పాట్లు చేశారు. తొలిసారిగా ఆటో ప్రాసెస్ విధానంలో వడ్డీ జమ చేయడం ప్రారంభించారు. రూ.5 లక్షల్లోపు పీఎఫ్ క్లెయిమ్స్‌ను పేపర్‌లెస్ విధానంలో ఆటో సెటిల్‌మెంట్ చేయనున్నారు. క్లెయిమ్ ఆమోదం పూర్తయిన రోజే సభ్యుని బ్యాంక్ ఖాతాలోకి నేరుగా డబ్బు బదిలీ అవుతుంది. సాధారణంగా మూడు రోజుల్లో క్లెయిమ్ సెటిల్ అవుతుందని ఈపీఎఫ్ఓ తెలిపింది. మరో ముఖ్యమైన మార్పు ఈపీఎస్ పెన్షనర్లకు వర్తిస్తుంది. ఇకపై దేశంలోని ఏ పీఎఫ్ కార్యాలయం నుంచైనా సేవలు పొందవచ్చు. లైఫ్ సర్టిఫికేట్లు కూడా ఎక్కడినుంచైనా సమర్పించవచ్చు. అంతేకాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా తమ బ్యాంక్ ఖాతా ద్వారా పెన్షన్ అందుకునే అవకాశం కల్పించారు. గతంలో సంబంధిత ప్రాంతీయ కార్యాలయంపై ఆధారపడాల్సి వచ్చేది. తుది పీఎఫ్ సెటిల్‌మెంట్‌లో కూడా కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఇప్పుడు చెల్లింపు ఆమోదం తేదీ వరకు వడ్డీ లెక్కిస్తారు. గతంలో మాత్రం గత నెల చివరి తేదీ వరకు మాత్రమే వడ్డీ గణించేవారు. ఉద్యోగం మారినప్పుడు ఆధార్‌తో లింక్ అయిన UAN ఖాతా ఉంటే పీఎఫ్ మొత్తం, సర్వీస్ హిస్టరీ ఆటోమేటిక్‌గా కొత్త కంపెనీకి బదిలీ అవుతుంది. సభ్యులు ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. క్లెయిమ్ దాఖలు సమయంలో విత్‌డ్రాయల్ పరిమితి సమాచారం కూడా చూపించనుండటంతో తిరస్కరణలు తగ్గే అవకాశం ఉంది. విత్‌డ్రాయల్ వివరాలను ఎస్‌ఎంఎస్ ద్వారా సభ్యులకు పంపించనున్నారు.

Also read: