(FIFA) ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఉత్కంఠభరిత దశలోకి ప్రవేశించింది. లీగ్ మ్యాచ్‌లు, ప్రీ-క్వార్టర్ ఫైనల్స్ ముగియడంతో ఇప్పుడు క్వార్టర్ ఫైనల్స్‌పై ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానుల దృష్టి నిలిచింది. ఈ దశకు చేరిన ఎనిమిది జట్లు తమ అద్భుతమైన ప్రదర్శనతో చివరి ఎనిమిదిలో స్థానం సంపాదించుకున్నాయి. నాకౌట్ రౌండ్‌లో అనేక సంచలన ఫలితాలు నమోదవడం ఈ టోర్నీ ప్రత్యేకతగా నిలిచింది. బ్రెజిల్‌ను నార్వే ఓడించగా, పోర్చుగల్‌ను స్పెయిన్ మట్టికరిపించింది. దీంతో ప్రపంచకప్ గెలవాలన్న నెయ్‌మార్, క్రిస్టియానో రొనాల్డో కలలు ఈసారి కూడా నెరవేరలేదు. అమెరికాపై బెల్జియం విజయం సాధించగా, ఈజిప్ట్‌పై అర్జెంటీనా కఠిన పోరాటం తర్వాత గెలిచింది. పెనాల్టీ షూటౌట్‌లో కొలంబియాను ఓడించిన స్విట్జర్లాండ్ కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఫ్రాన్స్, మొరాకో, స్పెయిన్, బెల్జియం, నార్వే, ఇంగ్లండ్, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు ఇప్పుడు టైటిల్ పోరులో నిలిచాయి. ఫిఫా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు జులై 10 నుంచి ప్రారంభమవుతాయి. మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్, మొరాకో బోస్టన్ స్టేడియంలో తలపడనున్నాయి. రెండో మ్యాచ్‌లో స్పెయిన్, బెల్జియం లాస్ ఏంజిల్స్‌లో పోటీ పడతాయి. మూడో క్వార్టర్ ఫైనల్లో నార్వే, ఇంగ్లండ్ మయామిలో తలపడగా, నాలుగో మ్యాచ్‌లో అర్జెంటీనా, స్విట్జర్లాండ్ కాన్సాస్ సిటీలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులకు భారీ వినోదాన్ని అందించనున్నాయి. సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లు ఎవరో అన్న ఉత్కంఠ నెలకొంది. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజామున వరకు మ్యాచ్‌లు జరగనున్నాయి. టీవీలో యునైటెడ్ 8 స్పోర్ట్స్ ఛానెల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం ఉండగా, జీ5 ఓటీటీ ద్వారా అభిమానులు తమకు నచ్చిన భాషలో వీక్షించవచ్చు. టైటిల్ కోసం పోటీ పడుతున్న ఈ ఎనిమిది జట్లలో ఎవరు ప్రపంచ ఛాంపియన్‌గా నిలుస్తారో అన్న ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది.
(FIFA) క్వార్టర్ ఫైనల్‌కు చేరిన 8 జట్లు
France, Morocco,Spain, Belgium, Norway, England, Argentina,Switzerland
క్వార్టర్ ఫైనల్ పూర్తి షెడ్యూల్ (IST)
ఎలా చూడాలి?
భారత్‌లో టీవీ ప్రసార హక్కులు United 8 Sports ఛానెల్స్‌కు ఉండగా, ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ZEE5 OTT ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటుంది.
Also read:
