Hyderabad: ఆషాడ బోనాలు ప్రారంభం.

Hyderabad

Hyderabad

(Hyderabad) హైదరాబాద్‌లో ఆషాడ బోనాల ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. జూలై 16 నుంచి ప్రారంభమయ్యే ఈ ఉత్సవాలకు సంబంధించి మంత్రి Konda Surekha బోనాల జాతర పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, (Hyderabad) హైదరాబాద్ బోనాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్‌కు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. హిందూ, ముస్లిం సమాజాల పరస్పర సహకారం, ప్రజల లౌకిక స్ఫూర్తి దేశానికి ఆదర్శమని తెలిపారు. గోల్కొండలోని Jagadambika Mahankali Templeలో తొలి బోనం సమర్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు) | bonalu festival in hyderabad 2025  Photos | Sakshi

జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. బోనం సమర్పణ, తొట్టెలు రథం ఊరేగింపు, మెట్ల పూజ వంటి కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పార్కింగ్, బారీకేడ్లు, క్యూలైన్లు, తాగునీటి సదుపాయం, విద్యుత్, వైద్య సేవలు, ప్రత్యేక బస్సులు, పారిశుద్ధ్య ఏర్పాట్లు పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

Bonalu 2025: Know The Date, Rituals And Significance Of This Festival |  Times Now

 

దేవాలయ పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. గోల్కొండ కోట పరిధిలోని రోడ్లు, మెట్లు, హైమాస్ట్ లైట్లు, సూచిక బోర్డులు ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. ఉత్సవాల కాలమంతా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు. భక్తుల భద్రత విషయంలో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించిన మంత్రి, అనుమానితుల ఫొటోలతో అవగాహన పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సహకరించాలని కోరారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకుని సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Also read: