(Kondagattu) Anjaneya Swamy Temple లో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు ఆదివారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా (Kondagattu) ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతున్నాయి.

ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం Bhadrachalam Sri Sita Ramachandra Swamy Temple నుంచి పట్టు వస్త్రాలను ఘన ఊరేగింపుగా కొండగట్టుకు తీసుకువచ్చారు. కొండగట్టు వై జంక్షన్ నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. ఒగ్గు డోలు నృత్యాలు, కోలాటాలు, కళాకారుల ఆటపాటల మధ్య భక్తి భావనతో కార్యక్రమం కొనసాగింది.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే Medipalli Satyam, కొండగట్టు ఈఓ Anjana Reddy, భద్రాచలం ఈఓ Damodara Rao పాల్గొన్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు.

అనంతరం ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి యాగశాలకు ప్రత్యేక ఊరేగింపుగా తరలించారు. భక్తులు “జై అంజన్న” నినాదాలతో ఆలయ పరిసరాలను మార్మోగించారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మూడు రోజులపాటు జరిగే ఈ భారీ ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 1100 మంది పోలీసులతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్య సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.

హనుమాన్ జయంతి సందర్భంగా తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు కొండగట్టుకు చేరుకుంటున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం కొండగట్టు ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది.
Also read:
