వరంగల్ నగరానికి ఆధ్యాత్మిక చిహ్నంగా నిలిచిన (Bhadrakali) Temple భక్తులతో కిటకిటలాడుతోంది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ దేవాలయం సుమారు 6వ శతాబ్దంలో Chalukya dynasty కాలంలో నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. అనంతరం Kakatiya dynasty కాలంలో ఈ ఆలయానికి ప్రత్యేకమైన గుర్తింపు లభించింది.

ఈ దేవాలయంలో విరాజిల్లుతున్న (Bhadrakali ) భద్రకాళి అమ్మవారు 9 అడుగుల ఎత్తుతో, ఎనిమిది చేతులతో ఉగ్రరూపంలో సహజ సిద్ధమైన రాతిపై చెక్కబడి ఉండటం విశేషం. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా ఈ అమ్మవారిని భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు.

ప్రస్తుతం ఆలయంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 19వ తేదీన ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీ వరకు భక్తి వాతావరణంలో జరుగనున్నాయి. ప్రతిరోజూ ప్రత్యేక పూజలు, వేదపారాయణాలు, వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిత్యం విశేష పూజలు జరిగే ఈ ఆలయం, ఉత్సవ కాలంలో మరింత సందడిగా మారుతుంది. ముఖ్యంగా చైత్రమాసం ప్రారంభమైన ఉగాది నుంచి వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. ఈ సమయంలో ప్రతిరోజూ భిన్నమైన పూలతో లక్ష పుష్పార్చన నిర్వహించడం భక్తులకు కనుల విందుగా ఉంటుంది.
అలాగే ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం సుదీర్ఘ సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.

ఆలయ అర్చకులు నాగరాజు శర్మ మాట్లాడుతూ, ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే కాకుండా సంప్రదాయాలను కాపాడే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తానికి వరంగల్ భద్రకాళి ఆలయం ఇప్పుడు భక్తి, సంస్కృతి, చరిత్రల సమ్మేళనంగా వెలుగొందుతోంది.
Also read:
