విశాఖపట్నంలోని ప్రసిద్ధ (Simhachalam) Templeలో జరిగే వార్షిక Chandanotsavam కోసం భారీ స్థాయిలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 20న జరిగే ఈ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
మంగళవారం ఏప్రిల్ 14, 2026 (Simhachalam ) ఆలయంలో సంప్రదాయబద్ధంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయ ఈవో వెంకటరావు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి భక్తులకు ఉచిత దర్శనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. దర్శనం వేగంగా జరిగేలా క్యూలైన్ పొడవును గణనీయంగా తగ్గించారు. గతంలో సుమారు 6 కిలోమీటర్లుగా ఉన్న క్యూలైన్‌ను ఈసారి 2.5 కిలోమీటర్లకు కుదించారు. అలాగే భక్తుల రద్దీని నియంత్రించేందుకు రెండు వేర్వేరు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. గంటకు సుమారు 9 వేల నుంచి 10 వేల మంది వరకు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

టికెట్ల విక్రయ విధానంలో కూడా మార్పులు చేశారు. ఈ ఏడాది దర్శన టికెట్లలో 70 శాతం ఆన్‌లైన్ ద్వారా, 30 శాతం బ్యాంకుల ద్వారా విక్రయిస్తున్నారు. రూ.300 టికెట్లు 20 వేల, రూ.1000 టికెట్లు 16 వేల, రూ.1500 టికెట్లు 2 వేల అందుబాటులో ఉంచారు. టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించి ఉండగా, ప్రవేశ సమయంలో స్కాన్ చేసి భక్తులను అనుమతిస్తారు. భక్తులు తమ టికెట్‌పై ఉన్న టైమ్ స్లాట్‌కు అనుగుణంగా రావాలని అధికారులు సూచిస్తున్నారు.
రవాణా సదుపాయాల విషయంలో కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. భక్తుల కోసం 70 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 19 ఉదయం నుంచి కొండపైకి సాధారణ వాహనాలకు అనుమతి ఉండదు. కేవలం అధికారులు, ఆలయ సిబ్బంది, ఆర్టీసీ బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

భక్తుల సౌకర్యార్థం తాగునీరు, ఆహారం వంటి అవసరాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సుమారు 4 లక్షల వాటర్ బాటిల్స్, పాలు, బిస్కెట్లు, మజ్జిగను పంపిణీ చేయనున్నారు. అదనంగా జీవీఎంసీ మరియు సేవా సంస్థలు కూడా భక్తులకు సహాయం అందించనున్నాయి. చిన్నపిల్లలు తప్పిపోకుండా చైల్డ్ ట్రాకింగ్ ట్యాగ్‌లను అందిస్తున్నారు.
![]()
లడ్డూ ప్రసాదంగా లక్షన్నర చిన్న లడ్డూలను సిద్ధం చేశారు. దర్శన సమయాలను కూడా స్పష్టంగా ప్రకటించారు. ఉచిత దర్శనం, రూ.300 టికెట్ల భక్తులకు తెల్లవారుజామున 3 గంటల నుంచి అనుమతి ఉంటుంది. రూ.1000 టికెట్లకు ఉదయం 5 గంటల నుంచి, రూ.1500 టికెట్లకు ఉదయం 6 గంటల నుంచి దర్శనం కల్పిస్తారు. దివ్యాంగులకు ప్రత్యేకంగా ఉదయం 10 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 5 వరకు దర్శన అవకాశం కల్పించారు.
మొత్తంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసి, సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించేందుకు ఆలయ అధికారులు కృషి చేస్తున్నారు.
