(GasCylinder) గ్యాస్ సిలిండర్ల డెలివరీలో జాప్యం, అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌పై అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. ప్రజలకు ఇలాంటి సమస్యలు ఎదురైతే వెంటనే స్పందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
పౌరసరఫరాల శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గ్యాస్ సిలిండర్ (GasCylinder) డెలివరీ ఆలస్యం అయినా, అక్రమంగా నిల్వ చేసినా లేదా బ్లాక్ మార్కెట్‌కు మళ్లించినా వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1967కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. గ్యాస్ బుకింగ్‌లు, డెలివరీలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.
గత నెలలో విజిలెన్స్ బృందాలు నిర్వహించిన దాడుల్లో 5,079 డొమెస్టిక్ సిలిండర్లు, 70 చిన్న సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 2,089 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఎం. స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ, గ్యాస్ పంపిణీలో పారదర్శకత పెంచడమే లక్ష్యమని, బ్లాక్ మార్కెటింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తున్నామని తెలిపారు. డెలివరీ ఆలస్యం చేయడం, అధిక ధరలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే లైసెన్స్ రద్దు వరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రస్తుతం డిమాండ్‌కు అనుగుణంగా సుమారు 70% సరఫరా జరుగుతోందని, కొరత ఉన్న ప్రాంతాల్లో అదనపు నిల్వలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇకపై పౌరసరఫరాల శాఖ, పోలీసు యంత్రాంగం కలిసి సంయుక్త దాడులు నిర్వహించి అక్రమాలకు చెక్ పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.

మొత్తానికి, గ్యాస్ సరఫరాలో ఎలాంటి అక్రమాలు జరిగినా ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేస్తే సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి.
Also read:
