BlastMovie: థియేటర్లలో సూపర్ హిట్ అయిన

BlastMovie

BlastMovie

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ (BlastMovie)‘బ్లాస్ట్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. కోలీవుడ్ స్టార్ హీరో, యాక్షన్ కింగ్ Arjun Sarja ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన దక్కించుకుని కలెక్షన్ల పరంగా కూడా సత్తా చాటింది.

మే 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బ్లాస్ట్’ సినిమా స్ట్రాంగ్ కంటెంట్, యాక్షన్ సన్నివేశాలు, కుటుంబ భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎలాంటి భారీ ప్రమోషన్స్ లేకుండానే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సినీ వర్గాల్లో చర్చ జరిగింది. దీంతో ఈ సినిమాపై ఓటీటీ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది.

Blast OTT Release: Plot, Cast, When And Where You Can Watch Arjun Sarja's  Action Thriller

ఈ చిత్రంలో అర్జున్ సర్జాతో పాటు అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు సుభాష్ కె రాజ్ ఈ సినిమాను యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ కలగలిపి తెరకెక్కించారు. ముఖ్యంగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో సాగిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ (BlastMovie) సినిమా డిజిటల్ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ ఓటీటీ వేదిక Netflix లో ‘బ్లాస్ట్’ సినిమా జూన్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇక ఇంటి వద్ద నుంచే ఈ చిత్రాన్ని వీక్షించే అవకాశం పొందనున్నారు.

Blast OTT Release Date: When and Where to Watch

సినిమా కథ విషయానికి వస్తే, రాజారామ్ (అర్జున్), నీలవేణి (అభిరామి) దంపతులు కరాటే మాస్టర్లుగా జీవిస్తుంటారు. తమ కుమార్తె నీలాకు కూడా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తారు. పిల్లలకు ఉచితంగా కరాటే నేర్పుతూ, మరోవైపు మెడికల్ షాప్ నిర్వహిస్తూ సాధారణ జీవితం గడుపుతుంటారు.

అయితే ఒక సంఘటనతో వారి జీవితం మారిపోతుంది. స్థానిక రౌడీ గ్యాంగ్‌తో జరిగిన ఘర్షణ తర్వాత కుటుంబం ప్రమాదంలో పడుతుంది. ఆ తర్వాత అండర్‌వరల్డ్ ముఠా వారిని టార్గెట్ చేయడంతో కథ ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతుంది. కుటుంబం ఎదుర్కొన్న సవాళ్లు, వారి పోరాటం, యాక్షన్ ఎపిసోడ్స్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

కేజీఎఫ్, సలార్ చిత్రాలకు సంగీతం అందించిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించింది. థియేటర్లలో విజయం సాధించిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి.

Also read: