భారతీయ వంటకాలలో Green Chilli (Tips) పాత్ర ఎంతో ప్రత్యేకం. వంటకానికి తగిన కారం, రుచి ఇవ్వడంలో పచ్చిమిర్చి కీలకంగా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఉండే కాప్సైసిన్ శరీర మెటబాలిజాన్ని పెంచడంలో, ఫ్యాట్ బర్న్‌కు సహాయపడడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. పలు అధ్యయనాలు కూడా Green Chilli ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని సూచిస్తున్నాయి.
అయితే మార్కెట్ నుంచి తీసుకొచ్చిన పచ్చిమిర్చిని సరిగా భద్రపరచకపోతే, రెండు మూడు రోజుల్లోనే అవి మెత్తబడిపోయి పాడైపోతాయి. కానీ కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే, ఈ Green Chilliను నెల రోజుల వరకు కూడా తాజాగా ఉంచుకోవచ్చు.
ముందుగా పచ్చిమిర్చిని నిల్వ ఉంచే ముందు సరైన విధంగా సిద్ధం చేయడం చాలా ముఖ్యం. చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే, మిర్చిని అలాగే ఫ్రిజ్‌లో పెట్టడం. దీనివల్ల తేమ నిల్వ ఉండి త్వరగా పాడవుతుంది.

ముఖ్యమైన చిట్కాలు ఇవే:
- ముందుగా పచ్చిమిర్చిని శుభ్రంగా కడగాలి
- కడిగిన తర్వాత పూర్తిగా ఆరబెట్టాలి (నీటి తేమ లేకుండా)
- పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే తొడిమలు (stems) తీసేయాలి
(Tips) పచ్చిమిర్చి తొడిమల్లో ఎక్కువ తేమ ఉంటుంది. సాధారణంగా మిర్చి పాడవడం తొడిమ దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల బూజు లేదా బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి. అందుకే తొడిమలను తీసేయడం చాలా కీలకం.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. తొడిమలు తీసేసిన తర్వాత మిర్చిని కడగకూడదు. ఎందుకంటే తొడిమ తీసిన చోట చిన్న రంధ్రం ఏర్పడుతుంది. ఆ రంధ్రం ద్వారా నీరు లోపలికి వెళ్లి మిర్చి త్వరగా పాడవుతుంది.
అందువల్ల సరైన విధానం ఏమిటంటే: ముందుగా మిర్చిని కడిగి, బాగా ఆరబెట్టి, ఆ తర్వాత తొడిమలు తీసి నిల్వ చేయడం.
ఇక నిల్వ చేసే విధానం కూడా ముఖ్యం. పచ్చిమిర్చిని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో లేదా కాగితం టవల్‌తో చుట్టి ఫ్రిజ్‌లో ఉంచితే తేమ నియంత్రణలో ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
ఈ చిన్న చిట్కాలు పాటిస్తే Green Chilli పాడవుతాయనే టెన్షన్ అవసరం లేదు. వంటలో ఎప్పుడూ ఫ్రెష్ మిర్చి అందుబాటులో ఉంటుంది.
Also read: