(AP) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “తల్లికి వందనం” పథకం కింద ఈ ఏడాది నిధుల పంపిణీకి సిద్ధమైంది. జులై 15 నుంచి 17 వరకు అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డీబీటీ (Direct Benefit Transfer) విధానంలో డబ్బులు జమ చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను విడుదల చేసిన ప్రభుత్వం, డబ్బులు ఖాతాల్లో పడాలంటే తప్పనిసరిగా రెండు ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేయడం మొదటి తప్పనిసరి అర్హత. రెండవది ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. ఈ రెండు ప్రక్రియలు పూర్తి కాకపోతే పథకం కింద విడుదల చేసే నగదు నిలిచిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బ్యాంక్‌కు వెళ్లి ఆధార్ సీడింగ్, ఎన్‌పీసీఐ మ్యాపింగ్ వివరాలను చెక్ చేసుకుని వెంటనే పూర్తి చేసుకోవాలని సూచించారు. గత ఏడాది కూడా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ లేకపోవడంతో చాలామందికి డబ్బులు జమ కాలేదని (AP) ప్రభుత్వం గుర్తుచేసింది. అలాగే బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండటం కూడా అవసరమని తెలిపింది. ఇందుకోసం కేవైసీ (KYC) ప్రక్రియను సమయానికి పూర్తి చేయాలని సూచించింది. ఆధార్ ఆధారిత చెల్లింపులు సక్రమంగా జరగాలంటే ఖాతాలో తాజా కేవైసీ వివరాలు ఉండాలని అధికారులు చెబుతున్నారు. “తల్లికి వందనం” పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.15,000 ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. పిల్లల చదువు భారం తగ్గించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. గత నెలలోనే నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, లబ్ధిదారుల ఎంపిక మరియు సాంకేతిక కారణాల వల్ల ప్రక్రియ ఆలస్యమైంది. ఇప్పుడు జులై 15 నుంచి ప్రారంభమయ్యే మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా నిధుల పంపిణీ ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి లబ్ధిదారులు వెంటనే బ్యాంక్‌లో ఆధార్ లింకింగ్, ఎన్‌పీసీఐ మ్యాపింగ్, కేవైసీ వివరాలను చెక్ చేసుకుని పూర్తి చేస్తేనే “తల్లికి వందనం” సొమ్ము నేరుగా ఖాతాల్లో జమ అవుతుంది.
చెక్‌లిస్ట్
-
బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉందో లేదో చెక్ చేయండి.
-
NPCI మ్యాపింగ్ / ఆధార్ సీడింగ్ పూర్తి అయి ఉందో నిర్ధారించుకోండి.
-
KYC యాక్టివ్‌గా ఉందో లేదో బ్యాంక్‌లో చెక్ చేయండి.
-
అన్ని వివరాలు సరిగ్గా ఉంటేనే DBT ద్వారా రూ.15,000 జమ అయ్యే అవకాశం ఉంటుంది.
Also read:
