భారత్‌లో టెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ (Phone) 4బీ (Nothing Phone 4B) నేడు అధికారికంగా లాంచ్ కానుంది. ప్రత్యేకమైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నథింగ్ బ్రాండ్, ఇప్పుడు మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. మధ్యాహ్నం నిర్వహించనున్న అధికారిక లాంచ్ కార్యక్రమంలో ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, ప్రారంభ ఆఫర్లకు సంబంధించిన వివరాలు వెల్లడికానున్నాయి. స్టైలిష్ లుక్‌తో పాటు ఆధునిక ఫీచర్లను సరసమైన ధరలో అందించాలనే లక్ష్యంతో కంపెనీ ఈ డివైజ్‌ను రూపొందించింది.
ఈ లాంచ్‌లో ప్రధాన ఆకర్షణగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్పెషల్ ఎడిషన్ నిలవనుంది. ఈ కలెక్టర్ ఎడిషన్ (Phone) ఫోన్ బెంగళూరులోని ప్రత్యేక స్టోర్‌లో మాత్రమే పరిమిత సంఖ్యలో అందుబాటులోకి రానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల నుంచి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఒక్కరోజు మాత్రమే జరిగే ఈ ప్రత్యేక సేల్ కారణంగా క్రికెట్ అభిమానులు, నథింగ్ బ్రాండ్ ఫ్యాన్స్‌లో భారీ ఆసక్తి కనిపిస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ ఫోన్ విక్రయాలకు ఫ్లిప్‌కార్ట్ ప్రధాన భాగస్వామిగా వ్యవహరించనుంది. లాంచ్ సందర్భంగా ఎర్లీ బర్డ్ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు, యూపీఐ చెల్లింపులపై ప్రత్యేక ప్రయోజనాలు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ల ద్వారా వినియోగదారులు అదనపు తగ్గింపులను కూడా పొందే అవకాశముంది.
నథింగ్ ఫోన్ 4బీలో హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో స్మూత్ యూజర్ అనుభవాన్ని అందించనున్నట్లు సమాచారం. రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని శక్తివంతమైన ప్రాసెసర్‌ను ఇందులో అమర్చినట్లు తెలుస్తోంది. కంపెనీకి ప్రత్యేక గుర్తింపుగా నిలిచిన గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ కూడా ఈ మోడల్‌లో కొనసాగనుంది. ఈ ప్రత్యేక లైటింగ్ సిస్టమ్ ద్వారా ఫోన్‌ను చేతిలోకి తీసుకోకుండానే కాల్స్, నోటిఫికేషన్లు వంటి సమాచారాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది.
సాఫ్ట్‌వేర్ పరంగా నథింగ్ ఓఎస్‌తో ఈ ఫోన్ రానుండగా, శుభ్రమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో పాటు వేగవంతమైన పనితీరును అందించనుంది. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉండే అవకాశం ఉంది. సహజ రంగులతో స్పష్టమైన ఫోటోలు తీసుకునేలా కెమెరాను రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. 8GB, 12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 128GB, 256GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో కూడా సెక్యూరిటీ అప్‌డేట్లు, సాఫ్ట్‌వేర్ సపోర్ట్ అందించడం ద్వారా వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో నథింగ్ ముందుకు సాగుతోంది. ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో నథింగ్ ఫోన్ 4బీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మంచి పోటీని ఇవ్వనుందని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Also read:
