India: చేతిరాతతో రాసిన వీలునామా చెల్లుతుందా?

India

India

చాలామంది వీలునామా (Will) అంటే తప్పనిసరిగా లాయర్‌తో తయారు చేయించాలి, స్టాంప్ పేపర్‌పై రాయాలి లేదా సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్టర్ చేయించాలనే అభిప్రాయంలో ఉంటారు. అయితే (India) భారతీయ చట్టం ప్రకారం ఇవన్నీ తప్పనిసరి కాదు. సాధారణ తెల్ల కాగితంపై స్వహస్తాలతో రాసిన వీలునామా కూడా నిర్దిష్ట చట్టపరమైన నిబంధనలు పాటిస్తే పూర్తిగా చెల్లుబాటు అవుతుంది.

A handwritten Will can be legally valid but a few details matter

వీలునామా చట్టబద్ధంగా ఉండాలంటే ముఖ్యంగా (India) ఆస్తి యజమాని పూర్తి మానసిక స్పృహతో స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుని పత్రంపై సంతకం చేయాలి లేదా వేలిముద్ర వేయాలి. అంతేకాకుండా కనీసం ఇద్దరు సాక్షులు యజమాని సంతకం చేయడాన్ని ప్రత్యక్షంగా చూసి, అదే సమయంలో తమ సంతకాలను కూడా చేయాలి. ఈ ప్రక్రియ సరిగ్గా పాటించకపోతే భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Types of Will in India & Essentials of a Valid Will - A Complete Legal Guide

చాలామందికి మరో సందేహం వీలునామా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించాలా అనేది. చట్టపరంగా చూస్తే వీలునామా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు. రిజిస్ట్రేషన్ లేకపోయినా చట్టపరమైన అర్హతలను పూర్తి చేసిన వీలునామా చెల్లుబాటు అవుతుంది. అయితే రిజిస్టర్ చేయిస్తే భవిష్యత్తులో వివాదాలు తలెత్తే అవకాశాలు కొంతవరకు తగ్గుతాయి.

NRI Will in India: Is a Foreign Will Valid Legally? - Sheokand Legal

వీలునామా రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. పూర్తి పేరు, చిరునామా, ఆస్తుల వివరాలు, ఎవరికి ఏ ఆస్తి ఇవ్వాలనుకుంటున్నారో స్పష్టంగా పేర్కొనాలి. ప్రతి పేజీపైనా యజమాని సంతకం ఉండటం మంచిది. అలాగే లబ్ధిదారులతో ప్రత్యక్ష సంబంధం లేని తటస్థ వ్యక్తులను సాక్షులుగా ఎంపిక చేస్తే మరింత విశ్వసనీయత ఉంటుంది.

జీవితంలో వివాహం, పిల్లల జననం, కొత్త ఆస్తుల కొనుగోలు లేదా కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు పాత వీలునామాను సమీక్షించి అవసరమైతే కొత్తదాన్ని తయారు చేసుకోవడం మంచిది. సరైన విధానంలో సిద్ధం చేసిన చేతిరాత వీలునామా కూడా కోర్టులో బలమైన చట్టపరమైన పత్రంగా పరిగణించబడుతుంది. అయితే కుటుంబ ఆస్తులు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా క్లిష్ట పరిస్థితులు ఉంటే న్యాయ నిపుణుల సలహా తీసుకోవడం మరింత ఉత్తమం.

Also read: