(Renault) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మే 2026 నెల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న వినియోగదారులకు ఇది మంచి అవకాశంగా మారింది. ముఖ్యంగా Renault Kiger, Renault Triber, Renault Kwid మోడళ్లపై భారీ డిస్కౌంట్లు మరియు ఇతర బెనిఫిట్స్ అందుబాటులో ఉంచారు. ఈ ఆఫర్లు మే 31, 2026 వరకు మాత్రమే అమల్లో ఉంటాయని కంపెనీ తెలిపింది.

అత్యధిక బెనిఫిట్స్ (Renault) Kiger మోడల్‌పై లభిస్తున్నాయి. ప్రస్తుత VIN 2026 స్టాక్‌పై వినియోగదారులు గరిష్టంగా ₹65,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ మరియు గ్రామీణ ఆఫర్లు ఉన్నాయి. పాత MY2025 స్టాక్‌పై అయితే ₹88,500 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు. ఈ SUVలో 100 PS టర్బో పెట్రోల్ ఇంజిన్, మూడు డ్రైవ్ మోడ్లు, 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే వెంటిలేటెడ్ సీట్లు, వైర్లెస్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ వంటి ప్రీమియం ఫీచర్లు కూడా వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
![]()
కుటుంబ అవసరాలకు అనువైన Renault Triber మోడల్‌పై కూడా మంచి ఆఫర్లు ప్రకటించారు. 2026 స్టాక్‌పై గరిష్టంగా ₹45,000 వరకు బెనిఫిట్స్ అందిస్తున్నారు. MY2025 స్టాక్ కొనుగోలు చేస్తే ₹60,000 వరకు తగ్గింపులు లభించే అవకాశం ఉంది. ఈ 7-సీటర్ వాహనంలో మల్టిపుల్ సీటింగ్ మోడ్లు, 625 లీటర్ల వరకు బూట్ స్పేస్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ABS + EBD వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

అదే సమయంలో బడ్జెట్ కార్ కొనుగోలుదారుల కోసం Renault Kwidపై కూడా ఆకర్షణీయమైన డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ మోడల్‌పై గరిష్టంగా ₹40,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. పాత స్టాక్‌పై అయితే ₹50,000 వరకు ప్రయోజనాలు పొందవచ్చు. స్టైలిష్ SUV-ఇన్స్పైర్డ్ డిజైన్, 8-అంగుళాల టచ్‌స్క్రీన్, డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఈ కారును మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.

అయితే కొత్తగా విడుదలైన Renault Dusterపై ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేవు. నగరం మరియు డీలర్షిప్ ఆధారంగా బెనిఫిట్స్ మారే అవకాశం ఉండటంతో వినియోగదారులు సమీప షోరూమ్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలని కంపెనీ సూచిస్తోంది.
Also read:
