(Mahindra) & Mahindra భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో మరో భారీ అడుగు వేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తన బోర్న్-ఎలక్ట్రిక్ లైనప్‌తో ఆకట్టుకుంటున్న మహీంద్రా, ఇప్పుడు కొత్తగా ‘బీఈ 07’ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని తీసుకురానుంది. లగ్జరీ డిజైన్, పవర్‌ఫుల్ బ్యాటరీ, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో ఈ కొత్త ఈవీ ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది.
(Mahindra) BE 07 మహీంద్రా బోర్న్-ఎలక్ట్రిక్ లైనప్‌లో నాలుగో మోడల్‌గా రానుంది. ఈ ఎస్‌యూవీ డిజైన్‌ను చూసిన చాలామంది దీనిని Range Rover స్టైల్‌ను తలపించేలా ఉందని అభిప్రాయపడుతున్నారు. బాక్సీ ఎస్‌యూవీ స్టైల్‌తో పాటు ప్రీమియం లుక్, స్టైలిష్ ఎలిమెంట్స్ ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో 79 kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక్కసారి పూర్తి చార్జ్ చేస్తే సుమారు 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని వల్ల దీర్ఘ ప్రయాణాలకు కూడా ఈ వాహనం అనుకూలంగా ఉండనుంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, బీఈ 07లో ఫ్యూచరిస్టిక్ క్యాబిన్ డిజైన్ ఇవ్వనున్నారు. ట్రిపుల్ స్క్రీన్ డాష్‌బోర్డ్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు, డిజిటల్ ఇంటర్‌ఫేస్ ఈ కారును మరింత ప్రీమియంగా మార్చనున్నాయి. అంతేకాదు, 16 స్పీకర్ల Harman Kardon సౌండ్ సిస్టమ్ కూడా ఇందులో ఉండనుంది. దీని వల్ల ప్రయాణికులకు లగ్జరీ ఆడియో అనుభవం లభించనుంది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మహీంద్రా 2027లో మార్కెట్‌లో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ధర విషయానికి వస్తే, రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉండొచ్చని ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ వేగంగా పెరుగుతున్న సమయంలో మహీంద్రా తీసుకొస్తున్న ఈ కొత్త బీఈ 07, ప్రీమియం ఈవీ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీకి సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also read:
