వినాయక చవితి వచ్చిందంటే హైదరాబాద్ నగరం మొత్తం పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. గణేష్ నవరాత్రుల సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల్లో భారీగా వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు భక్తి కార్యక్రమాలతో పాటు పలు చోట్ల (Annadhanam) అన్నదాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. దీంతో ప్రతిరోజూ నగరంలోని ఏదో ఒక ప్రాంతంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందుబాటులో ఉంటుంది.
ఈ నేపథ్యంలో రూమ్‌లలో వంట చేసుకునే ఇబ్బందులు పడే బ్యాచిలర్స్, హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉపయోగపడేలా ఓ ప్రత్యేక వెబ్సైట్ అందుబాటులోకి వచ్చింది. ‘Annadhanam Spots’ పేరుతో రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా హైదరాబాద్‌లో ఏ రోజు, ఎక్కడ అన్నదానం జరుగుతుందో సులభంగా తెలుసుకోవచ్చు.
వెబ్సైట్లో మనకు సమీపంలోని (Annadhanam) అన్నదానం కేంద్రాల వివరాలతో పాటు వాటి లొకేషన్, సమయాలను కూడా ఉచితంగా తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాదు, తమ ప్రాంతంలో జరుగుతున్న అన్నదాన కార్యక్రమం గురించి తెలిసిన వారు ఆ వివరాలను పోర్టల్‌లో స్వయంగా నమోదు చేయవచ్చు. దీంతో మరింత మంది భక్తులు, విద్యార్థులు, బ్యాచిలర్స్‌కు ఈ సమాచారం అందుబాటులోకి వస్తుంది.
మరోవైపు ఖైరతాబాద్‌లోని పంచముఖ సంకటహర మహాగణపతి వద్ద భక్తుల రద్దీ కొనసాగుతోంది. మండపం పరిసరాలు, క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రద్దీ మరింత పెరుగుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శనం చేసుకున్నట్లు సమాచారం. భారీ వర్షం కురిసినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బడా గణేష్‌ను దర్శించుకున్నారు.
రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో పోలీసులు తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గణేష్ నవరాత్రుల్లో హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో జరిగే అన్నదాన కార్యక్రమాలను సులభంగా తెలుసుకునేందుకు Annadhanam Spots పోర్టల్ ఉపయోగపడనుంది.
Also read:
