Reserve Bank of India (RBI) కొత్త రికవరీ నిబంధనలతో బ్యాంకులు మరియు ఫైనాన్స్ సంస్థలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. లోన్ చెల్లింపుల విషయంలో కస్టమర్లను వేధించే చర్యలపై కఠిన నియంత్రణలు తీసుకురానుంది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త రూల్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం హోమ్ లోన్, కార్ లోన్ మరియు పర్సనల్ లోన్ తీసుకున్న కస్టమర్ల ఫోన్లను బ్లాక్ చేయడం ఇక అనుమతించబడదు. లోన్ రికవరీ పేరుతో కస్టమర్ల కమ్యూనికేషన్‌ను నిలిపివేయడం లేదా ఫోన్ సేవలకు అంతరాయం కలిగించడం వంటి చర్యలు తీసుకుంటే సంబంధిత బ్యాంకులు జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సమాచారం.
ఇకపై రికవరీ ఏజెంట్లు కస్టమర్లను బెదిరించడం, అసభ్య పదజాలం ఉపయోగించడం లేదా మానసిక ఒత్తిడికి గురిచేయడం పూర్తిగా నిషేధం కానుంది. ఈ తరహా ఫిర్యాదులు వస్తే ఆర్థిక సంస్థలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, రికవరీ ఏజెంట్లు చేసే కాల్స్ తప్పనిసరిగా రికార్డ్ చేయాల్సి ఉంటుంది. దీంతో కస్టమర్లకు అన్యాయం జరిగితే ఆధారాలు సులభంగా అందుబాటులో ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో కస్టమర్ల వ్యక్తిగత వివరాలు లేదా లోన్ బకాయిల వివరాలు పోస్టు చేయడం కూడా నేరంగా పరిగణించబడనుంది. కొంతమంది రికవరీ ఏజెంట్లు బకాయిల పేరుతో కస్టమర్ల ఫోటోలు, ఫోన్ నంబర్లు మరియు వ్యక్తిగత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ కొత్త రూల్స్‌తో (RBI) బ్యాంకింగ్ రంగంలో కస్టమర్ హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా లోన్ రికవరీ పేరుతో జరిగే వేధింపులు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ మార్పులు సోషల్ మీడియాలో కూడా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. బ్యాంకుల వ్యవహార శైలిలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు.
Also read:
