(Apple) మరోసారి స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టేలా కనిపిస్తోంది. 2027లో విడుదల చేయబోయే కొత్త iPhone మోడల్‌పై ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది. పూర్తిగా వంగిన డిస్‌ప్లేతో “ఫుల్లీ కర్వ్డ్ ఐఫోన్”ను తీసుకురావడానికి ఆపిల్ పని చేస్తున్నట్లు టెక్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.
ఈ కొత్త మోడల్‌లో నాలుగు వైపులా వంగిన “క్వాడ్ కర్వ్డ్” OLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సాధారణ కర్వ్డ్ డిస్‌ప్లే ఫోన్లతో పోలిస్తే ఇది మరింత ఫ్యూచరిస్టిక్ లుక్ ఇవ్వనుందని చెబుతున్నారు. ముఖ్యంగా బెజెల్స్ లేకుండా “లిక్విడ్ గ్లాస్” తరహా అనుభూతిని అందించేలా డిజైన్ చేయాలనే లక్ష్యంతో ఆపిల్ పనిచేస్తోందని టెక్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డిస్‌ప్లే టెక్నాలజీలో కూడా ఆపిల్ (Apple) కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం. 2028 మోడల్ కోసం అధునాతన “IZO” డిస్‌ప్లే టెక్నాలజీపై పరిశోధనలు కొనసాగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టెక్నాలజీ ద్వారా డిస్‌ప్లే ఎడ్జ్‌ల వద్ద బ్రైట్‌నెస్ మరియు క్లారిటీని మరింత మెరుగుపరచే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది.
ఇప్పటి వరకు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కర్వ్డ్ డిస్‌ప్లేలను ప్రధానంగా రెండు వైపులకే పరిమితం చేశాయి. కానీ ఆపిల్ నాలుగు వైపులా వంగిన డిస్‌ప్లేతో వస్తే అది మొబైల్ డిజైన్‌లో పెద్ద మార్పుగా భావిస్తున్నారు. ముఖ్యంగా గేమింగ్, వీడియో స్ట్రీమింగ్ మరియు విజువల్ అనుభవం మరింత ప్రీమియంగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో కూడా ఈ ఫ్యూచర్ ఐఫోన్ డిజైన్‌పై భారీ చర్చ నడుస్తోంది. “ఇది నిజంగానే ఫోన్‌నా లేక గ్లాస్ పీస్‌నా?” అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఇది స్మార్ట్‌ఫోన్ డిజైన్‌లో కొత్త యుగానికి నాంది కావచ్చని అభిప్రాయపడుతున్నారు.
అయితే ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. కానీ లీకులు, టెక్ రిపోర్ట్స్ కారణంగా “ఫుల్లీ కర్వ్డ్ ఐఫోన్” ఇప్పటికే టెక్ ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది.
Also read:
