Cancer: లిక్కర్, సిగరేట్ మానేస్తే 40% క్యాన్సర్లు ఉండవ్

Cancer

Cancer

Cancer పై వచ్చిన తాజా అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రముఖ మెడికల్ జర్నల్ Nature Medicineలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, జీవనశైలిలో మార్పులు చేసుకుంటే దాదాపు 40 శాతం Cancer కేసులను నివారించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

ఈ పరిశోధనలో ముఖ్యంగా పొగాకు వినియోగం క్యాన్సర్‌కు ప్రధాన కారణమని స్పష్టం చేశారు. సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల శరీరంలోని పలు అవయవాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ముఖ్యంగా ఊపిరితిత్తులు, గొంతు, నోటి క్యాన్సర్ల ప్రమాదం భారీగా పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మద్యం అధికంగా తీసుకోవడం కూడా క్యాన్సర్‌కు మరో కీలక ప్రమాద కారకంగా పరిశోధన పేర్కొంది. ఆల్కహాల్ కారణంగా కాలేయం, జీర్ణ వ్యవస్థ, గొంతు సంబంధిత క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని వివరించారు.

మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్‌కు హెచ్‌పీవీ వైరస్ ప్రధాన కారణమని అధ్యయనం వెల్లడించింది. సరైన సమయంలో వ్యాక్సిన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

పోషకాహారం, వ్యాయామం, పొగాకు-మద్యం దూరం పెట్టడం, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు వంటి అలవాట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు తెలిపారు.

అలాగే వైరల్ ఇన్‌ఫెక్షన్లు కూడా కొన్ని రకాల క్యాన్సర్లకు కారణమవుతున్నాయని అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా హెచ్‌పీవీ, హెపటైటిస్ వంటి వైరస్‌లపై అవగాహన పెంచడం అవసరమని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతం ఈ అధ్యయనం ఆరోగ్య రంగంలో పెద్ద చర్చకు దారితీసింది. చిన్న జీవనశైలి మార్పులు కూడా పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేయగలవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read: