(Hyderabad) కు చెందిన టెకీ శ్రవణ్ వెంకటరామన్ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో ఇళ్లు కొనొద్దని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నగర జీవనశైలి, అపార్ట్మెంట్ సంస్కృతి, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల పాత్రపై పెద్ద చర్చకు దారి తీశాయి.
సోషల్ మీడియాలో చేసిన తన పోస్టులో శ్రవణ్ వెంకటరామన్, చిన్న అపార్టుమెంట్లలో జీవించడం మరింత ప్రశాంతంగా ఉంటుందని పేర్కొన్నారు. (Hyderabad) భారీ గేటెడ్ కమ్యూనిటీల్లో రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరు రావాలి, ఎవరు ఉండాలి, ఎలాంటి నియమాలు పాటించాలి వంటి అంశాలపై కొన్ని అసోసియేషన్లు అతిగా జోక్యం చేసుకుంటున్నాయని విమర్శించారు.
![]()
శ్రవణ్ పోస్టు ప్రకారం, భద్రత, నిర్వహణ వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తినా “సొసైటీ ఇమేజ్ దెబ్బతింటుంది” అంటూ మందలిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించడంపై కాకుండా వాటిని బయటకు రాకుండా చూడడంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారని పేర్కొన్నారు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవడంతో అనేక మంది టెకీలు, అపార్ట్మెంట్ నివాసితులు స్పందిస్తున్నారు. కొందరు శ్రవణ్ అభిప్రాయాలకు మద్దతు తెలుపుతూ, పెద్ద గేటెడ్ కమ్యూనిటీల్లో వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోతుందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు అయితే భద్రత, సదుపాయాల పరంగా పెద్ద కమ్యూనిటీలు అవసరమేనని అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం మెట్రో నగరాల్లో గేటెడ్ కమ్యూనిటీలకు భారీ డిమాండ్ ఉంది. 24 గంటల భద్రత, క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పిల్లల పార్కులు వంటి సదుపాయాల కారణంగా చాలా మంది ఇలాంటి ప్రాజెక్టుల వైపు ఆకర్షితులవుతున్నారు. అయితే కొన్ని చోట్ల అసోసియేషన్ల నియంత్రణ, కఠిన నిబంధనలు నివాసితులకు అసౌకర్యంగా మారుతున్నాయన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. “సౌకర్యాల పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛ తగ్గిపోతోందా?”, “గేటెడ్ కమ్యూనిటీల్లో నిజంగా ప్రశాంత జీవనమా?” అనే ప్రశ్నలు నెటిజన్ల మధ్య చర్చకు వస్తున్నాయి. కొందరు చిన్న అపార్టుమెంట్లలో పొరుగువారితో స్నేహపూర్వక వాతావరణం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

ఇటీవల నగరాల్లో కమ్యూనిటీ లివింగ్ కల్చర్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో శ్రవణ్ వెంకటరామన్ పోస్టు మరోసారి అర్బన్ లైఫ్‌స్టైల్‌పై చర్చను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టుకు వేల సంఖ్యలో లైక్స్, కామెంట్లు వస్తుండగా, టెకీల మధ్య ఇది హాట్ టాపిక్‌గా మారింది.
Also read:
