Ebola: ఎబోలా వైరస్‌పై భారత్ అలర్ట్

Ebola

Ebola

(Ebola) వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాలైన Democratic Republic of the Congo, Uganda ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి కొనసాగుతున్నట్లు సమాచారం రావడంతో కేంద్ర, రాష్ట్ర ఆరోగ్య శాఖలు ముందస్తు చర్యలు ప్రారంభించాయి. దేశంలోని కీలక అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

Delhi, Mumbai, Gujarat ప్రాంతాల్లోని ఎయిర్‌పోర్టుల్లో హెల్త్ అలర్ట్ ప్రకటించారు. ఆఫ్రికా దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, అలసట, శరీర నొప్పులు వంటి లక్షణాలు ఉన్న వారిని వెంటనే వైద్య పర్యవేక్షణలోకి తీసుకుంటున్నారు.

Image

ఇటీవల ఆఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యాపారవేత్తతో పాటు మరో నలుగురిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వ్యాపారవేత్త కొన్ని రోజుల క్రితం ముంబైకి చేరుకుని అక్కడి నుంచి వడోదరాకు వెళ్లినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అనంతరం ఆయనకు జ్వరం రావడంతో మొదట స్థానిక ఆసుపత్రిలో చేర్పించి, తర్వాత ప్రత్యేక వైద్య సదుపాయాల కోసం Ahmedabad లోని సివిల్ హాస్పిటల్ ఐసోలేషన్ వార్డుకు తరలించారు.

ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉన్న మరో ఇద్దరిని, అలాగే వైద్యం అందించిన డాక్టర్‌ను కూడా ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. వీరందరి రక్త నమూనాలను సేకరించి పరీక్షల కోసం Pune లోని ప్రత్యేక ల్యాబ్‌కు పంపించారు.

Image

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారమే ఈ చర్యలు తీసుకుంటున్నామని గుజరాత్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అనుమానితులను 10 నుంచి 11 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

అయితే ఇప్పటివరకు భారత్‌లో ఒక్క (Ebola) ఎబోలా కేసు కూడా నిర్ధారణ కాలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, శరీర ఉష్ణోగ్రత కూడా సాధారణంగానే ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.

ఆరోగ్య మంత్రి Rushikesh Patel ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇది పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్య మాత్రమేనని, టెస్ట్ రిపోర్టులు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో “ఎబోలా ఇండియాలోకి వచ్చిందా?” అనే చర్చ జరుగుతున్నప్పటికీ, అధికారులు మాత్రం అపోహలు నమ్మవద్దని సూచిస్తున్నారు. జ్వరం లేదా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వెంటనే సమీప ఆసుపత్రిని సంప్రదించాలని ప్రజలకు సూచించారు.

Also read: