Navaratri: వారాహి నవరాత్రి దీక్షా విధానం

Navaratri

Navaratri

శ్రీ వారాహి గుప్త (Navaratri) నవరాత్రి దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించేందుకు పలు నియమాలను పాటించాలని ఆధ్యాత్మిక వర్గాలు సూచిస్తున్నాయి. దీక్ష ప్రారంభానికి ముందు రోజు ఇంటిని శుభ్రపరచి, పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు, నూనె, సామ్రాణి వంటి పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజా పీటపై ఎర్రని వస్త్రం పరిచి, శ్రీ వారాహి లేదా దుర్గాదేవి చిత్రాన్ని ప్రతిష్ఠించి దీపారాధన చేయాలి.

Varahi Navratri-Dhumra Varahi & Maha Varahi | PoojaHomam – PoojaHomam.Org

 

తొమ్మిది రోజుల దీక్షలో ప్రతి రోజు ఉదయం తలస్నానం చేసి, దీక్ష వస్త్రాలు ధరించడం లేదా మెడలో దీక్ష కండువా ఉంచుకోవడం శ్రేయస్కరమని భావిస్తారు. గణపతి ప్రార్థన అనంతరం వారాహి అష్టోత్తరం, సహస్రనామం లేదా ద్వాదశ నామాలను జపిస్తూ ఎర్రటి పుష్పాలతో కుంకుమార్చన చేయాలి. దానిమ్మ గింజలు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించడం కూడా ఆనవాయితీగా ఉంది. ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాలని సూచిస్తున్నారు.

Varahi Navratri Pooja and Worship of Sri Bala Varahi for Divine Blessings

 

 

దీక్ష కాలంలో మాంసాహారం, మద్యం, పాదరక్షలు వాడకూడదని, సాధ్యమైనంత వరకు బ్రహ్మచర్యం పాటించి నేలపై విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారు. సమయం తక్కువగా ఉన్నవారు ఉదయం, సాయంత్రం దీపం వెలిగించి పూలు, పండ్లు సమర్పించి వారాహి ద్వాదశ నామాలను జపించవచ్చని పండితులు సూచిస్తున్నారు. భక్తి, నియమం ముఖ్యమని, విధానం సులభమైనా శ్రద్ధతో చేయడం అవసరమని చెబుతున్నారు.

Today, Amma Breaks What You've Been Holding, Dear friend,, July 1, 2026 • Wednesday • Aani month • Krishna Paksha, Dwitiyai 🌗, Wednesday belongs to Budhan — clarity, sharp decisions. Perfect day to ...

(Navaratri) దీక్ష ముగింపు రోజున మంగళహారతి ఇచ్చి, కొబ్బరికాయ కొట్టి, అమ్మవారికి మన కోరికలు తెలియజేసి ఆశీస్సులు కోరుకోవడం సంప్రదాయం. ఆధ్యాత్మిక విశ్వాసాల ప్రకారం ఈ దీక్ష ద్వారా మానసిక ప్రశాంతత, ధైర్యం, శుభఫలితాలు, కుటుంబ సౌఖ్యం, రక్షణ లభిస్తాయని భక్తులు నమ్ముతారు. అలాగే కుంకుమ, రక్షా కంకణాలు, దీక్ష కండువాను శుభప్రదంగా భావించి భద్రంగా ఉంచుకుంటారు. మొత్తంగా శ్రీ వారాహి నవరాత్రి దీక్షను భక్తులు ఆధ్యాత్మిక శక్తి, అంతరంగ శుద్ధి, దైవ అనుగ్రహం పొందేందుకు ప్రత్యేక సాధనగా భావిస్తున్నారు.

Also read: