Tips: గర్భధారణ సమయంలో విస్మరించకూడని సంకేతాలు

Tips

Tips

(Tips) గర్భధారణ ప్రతి మహిళ జీవితంలో ప్రత్యేకమైన దశ. అయితే ఈ సమయంలో శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి కాబట్టి కొన్ని ప్రమాద సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గర్భధారణ సమయంలో తల్లి లేదా బిడ్డ ప్రాణాలకు ముప్పు కలిగించే అనూహ్య ఆరోగ్య సమస్యలను గర్భధారణ అత్యవసర పరిస్థితులు అంటారు.

Pregnant? 8 tips for minimizing morning sickness and constipation

 

(Tips) ఇవి గర్భం దాల్చిన మొదటి దశ నుంచి ప్రసవం వరకు ఎప్పుడైనా రావచ్చు. మొదటి మూడు నెలల్లో కడుపు కింది భాగంలో తీవ్రమైన నొప్పి, యోని రక్తస్రావం, స్పృహ తప్పడం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. ఇవి గర్భస్రావం లేదా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి సంకేతాలు కావచ్చు.

Unrecognizable pregnant woman holding headphones on her big belly panorama  | Premium Photo

భుజం చివర భాగంలో నొప్పి కూడా ప్రమాద సూచనగా భావిస్తారు. గర్భధారణలో అధిక రక్తపోటు, ప్రిక్లాంప్సియా వంటి సమస్యలు కూడా తీవ్రమైనవి. చేతులు, ముఖం లేదా పాదాలు అకస్మాత్తుగా వాపు రావడం, తగ్గని తలనొప్పి, కంటిచూపు మసకబారడం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త అవసరం.

Pregnant black woman with contractions feeling unwell at home | Premium  Photo

బిడ్డ కదలికలు తగ్గిపోవడం లేదా పూర్తిగా తెలియకపోవడం కూడా అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. ఏ దశలోనైనా తీవ్రమైన రక్తస్రావం, భరించలేని కడుపునొప్పి, నెలలు నిండకముందే ఉమ్మనీరు కారడం, అధిక జ్వరం, దుర్వాసనతో కూడిన తెల్లబట్ట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎమర్జెన్సీ వైద్య సహాయం తీసుకోవాలి.

Pregnancy symptoms you should never ignore | BabyCenter

ఆసుపత్రికి వెళ్లేలోపు గర్భిణిని ఎడమవైపు పడుకోబెట్టడం మంచిది. డాక్టర్ సలహా లేకుండా మందులు, ఆహారం లేదా నీరు ఇవ్వకూడదు. రక్తస్రావం ఉంటే శుభ్రమైన ప్యాడ్ మాత్రమే ఉపయోగించాలి. ఈ ప్రమాదాలను నివారించేందుకు క్రమం తప్పకుండా చెకప్‌లు చేయించుకోవడం, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం, ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకోవడం, అవసరమైన టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. చిన్న మార్పును కూడా నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ద్వారా తల్లి, బిడ్డను సురక్షితంగా కాపాడుకోవచ్చు.

Also read: