అమెరికా ఫస్ట్ లేడీ Melania (Trump), Jeffrey Epsteinతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇటీవల వైట్ హౌస్ సమీపంలో మీడియాతో మాట్లాడిన ఆమె, ఈ అంశంపై వస్తున్న ఆరోపణలకు ఇక ముగింపు పలకాలని కోరారు.
Melania Trump మాట్లాడుతూ, తాను 2000 సంవత్సరంలో ఒకసారి మాత్రమే Jeffrey Epsteinను కలిశానని తెలిపారు. అతని అక్రమ కార్యకలాపాల గురించి అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ఈ వివాదంలో తాను ఏ విధంగానూ సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు.

అదేవిధంగా, Jeffrey Epstein తనను Donald Trumpకు పరిచయం చేశాడన్న ఆన్‌లైన్ వదంతులను కూడా ఆమె ఖండించారు. ఈ ప్రచారాలు పూర్తిగా నిరాధారమని తెలిపారు.
ఇక ఈ కేసులో బాధితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ స్థాయిలో విచారణలు జరగాలని Melania (Trump) సూచించారు. న్యాయవ్యవస్థ ద్వారా నిజాలు బయటపడాలని ఆమె అభిప్రాయపడ్డారు.
తన ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఈ తరహా వదంతులకు ఇక పూర్తి స్థాయిలో చెక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని అన్నారు.
Also read: