(Tips) చూయింగ్ గమ్‌ను అప్పుడప్పుడు నమలడం వల్ల నోటి దుర్వాసన తగ్గడం, లాలాజలం ఉత్పత్తి పెరగడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చు. కానీ నిరంతరం నమలడం మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
(Tips) ఎక్కువసేపు గమ్ నమలడం వల్ల దవడ కండరాలపై అధిక భారం పడుతుంది. కాలక్రమేణా దవడ కీలు (TMJ)పై ఒత్తిడి పెరిగి, క్లిక్ శబ్దాలు వినిపించడం, కీలు బిగుసుకుపోవడం, నమిలేటప్పుడు నొప్పి రావడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
![]()
అంతేకాకుండా కణతల దగ్గర తలనొప్పి, ముఖంలో అసౌకర్యం కూడా కలిగే అవకాశం ఉంది. ముఖానికి వ్యాయామం అవుతుందనే ఉద్దేశంతో గంటల తరబడి గమ్ నమలడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్యానికి మేలు కావాలంటే మితంగా నమలండి.. అతిగా కాదు!
Also read:
