మన శరీరంలో గుండె అత్యంత కీలకమైన అవయవం. ఇది ప్రతి క్షణం రక్తాన్ని పంప్ చేస్తూ శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్, పోషకాలను చేరవేస్తుంది. (Tips) గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కేవలం నడక లేదా రన్నింగ్ మాత్రమే కాకుండా కండరాల బలాన్ని పెంచే వ్యాయామాలు కూడా అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గ్లెనెగల్స్ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం. సాయి సుధాకర్ ప్రకారం, కార్డియో వ్యాయామాలతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం గుండెపోటు, స్ట్రోక్, డయాబెటిస్, ఊబకాయం వంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.

కండరాలు శరీరంలో అతిపెద్ద జీవక్రియ అవయవం. అవి బలంగా ఉంటే రక్తంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో ఉండటంతో పాటు కేలరీలు ఎక్కువగా ఖర్చవుతాయి. అలాగే వాపులు తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. (Tips) గుండెకు మేలు చేసే వ్యాయామాల్లో స్క్వాట్స్ ముఖ్యమైనవి. ఇవి తొడలు, నడుము, కోర్ కండరాలను బలోపేతం చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
లంజెస్ కాళ్లు, నడుముకు బలం ఇచ్చి సమతుల్యతను పెంచుతాయి. పుష్-అప్స్ ఛాతీ, భుజాలు, చేతులు, కోర్ కండరాలను దృఢపరుస్తాయి. రెసిస్టెన్స్ బ్యాండ్ వ్యాయామాలు కీళ్లపై ఒత్తిడి లేకుండా కండరాలకు బలం ఇస్తాయి. లైట్ డంబెల్స్‌తో చేసే వ్యాయామాలు కండరాల పరిమాణం తగ్గకుండా కాపాడతాయి. ప్లాంక్స్ కోర్ కండరాలను బలపరచి నడుము నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.
స్టెప్-అప్స్ లేదా మెట్లు ఎక్కడం కాళ్లకు బలం ఇవ్వడంతో పాటు గుండె వేగాన్ని పెంచి కార్డియో వ్యాయామంలా పనిచేస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం వారానికి కనీసం 150 నిమిషాల మోస్తరు వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. అదనంగా రెండు నుంచి మూడు రోజులు స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం మంచిది.

వ్యాయామం ముందు వార్మ్-అప్, తర్వాత కూల్-డౌన్ చేయడం అవసరం. హై బీపీ, ఇటీవల గుండెపోటు వచ్చినవారు లేదా తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా డాక్టర్ సలహాతోనే ఈ వ్యాయామాలు ప్రారంభించాలి.

గుండెకు మేలు చేసే 7 వ్యాయామాలు
Also read:
