Realme: జూలై 15న భారత్‌లో లాంచ్ కానుంది

Realme

Realme

రియల్‌మీ తన నార్జో సిరీస్‌ను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది. కంపెనీ (Realme) NARZO 100x 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో జూలై 15 మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, స్మూత్ డిస్‌ప్లే, 5G కనెక్టివిటీ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ వినియోగదారులను ఆకర్షించేలా రూపొందించబడింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 8000mAh భారీ బ్యాటరీ. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. అలాగే నాలుగేళ్ల తర్వాత కూడా బ్యాటరీ సామర్థ్యం 80 శాతానికి పైగా కొనసాగుతుందని పేర్కొంది. దీనికి తోడు 45W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. కేవలం 33 నిమిషాల్లో 50 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని (Realme) రియల్‌మీ తెలిపింది. రివర్స్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉండటంతో ఇతర డివైస్‌లను ఈ ఫోన్ ద్వారా ఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. పనితీరు కోసం MediaTek Dimensity 6300 5G ప్రాసెసర్‌ను ఉపయోగిస్తున్నారు. 6nm టెక్నాలజీపై రూపొందించిన ఈ చిప్‌సెట్ తక్కువ విద్యుత్ వినియోగంతో మెరుగైన పనితీరును అందించగలదని భావిస్తున్నారు. గేమింగ్, మల్టీటాస్కింగ్, రోజువారీ వినియోగానికి ఇది సరిపోతుందని కంపెనీ సూచిస్తోంది. డిస్‌ప్లే పరంగా 6.72 అంగుళాల 120Hz Ultra Smooth Display అందిస్తున్నారు. కంటెంట్‌ను బట్టి రిఫ్రెష్ రేట్ ఆటోమేటిక్‌గా మారడం వల్ల బ్యాటరీ వినియోగం తగ్గడంతో పాటు స్మూత్ విజువల్ అనుభవం లభిస్తుంది. ఫోటోగ్రఫీ కోసం 50MP AI మెయిన్ కెమెరా ఇవ్వనున్నారు. స్టీరియో స్పీకర్లు మెరుగైన ఆడియో అనుభవాన్ని అందిస్తాయి. అదనంగా IP65 రేటింగ్, ArmorShell Structural Protection, Rainwater Smart Touch వంటి ఫీచర్లతో ఫోన్ మన్నికను పెంచారు. చేతులు తడిగా ఉన్నా టచ్ సరిగ్గా పనిచేసేలా ప్రత్యేక టెక్నాలజీని అందించారు. లాంచ్ అనంతరం Amazon Indiaతో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది.

Also read: