ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ (BSNL) తన భారత్ ఫైబర్ కస్టమర్ల కోసం సరికొత్త డిజిటల్ ఎంటర్టైన్మెంట్ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. సాధారణంగా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌తో వచ్చే ఫిక్స్డ్ OTT ప్యాకేజీలకు భిన్నంగా, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తమకు నచ్చిన OTTలను ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం BSNL ‘Build Your Own OTT’ (BYO OTT) పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ కొత్త విధానంలో భారత్ ఫైబర్ వినియోగదారులు 25కు పైగా ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్‌ల నుంచి తమకు కావాల్సిన యాప్స్‌ను ఎంచుకుని సొంతంగా OTT ప్యాక్‌ను రూపొందించుకోవచ్చు. అంటే తమకు ఉపయోగం లేని OTTలకు కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా, తమకు ఇష్టమైన కంటెంట్ అందించే ప్లాట్‌ఫామ్‌లను మాత్రమే ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉంటుంది.
(BSNL) అందిస్తున్న OTT ఎంపికల్లో JioHotstar, ZEE5, SonyLIV, Hungama, FanCode, Hoichoi, ShemarooMe, Lionsgate Play వంటి ప్రముఖ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నట్లు సంస్థ తెలిపింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు, క్రీడలు, ప్రాంతీయ కంటెంట్ వంటి విభిన్న వినోదాన్ని ఒకే ప్లాన్‌లో పొందేందుకు ఈ విధానం ఉపయోగపడనుంది.
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. వినియోగదారులు ప్రతి నెల తమ OTT ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కూడా ఉంది. ఒక నెలలో సినిమాలకు సంబంధించిన ప్లాట్‌ఫామ్‌లను ఎంచుకుంటే, తదుపరి నెలలో స్పోర్ట్స్ లేదా వెబ్ సిరీస్‌లకు సంబంధించిన యాప్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.
విడివిడిగా అన్ని OTT సేవలకు సబ్స్క్రిప్షన్లు తీసుకోవడంతో పోలిస్తే, కాంబో విధానంలో తక్కువ ఖర్చుతో వినోదాన్ని అందించడమే ఈ సేవ లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇప్పటికే BSNL Bharat Fiber ఉపయోగిస్తున్న వారికి తమ అవసరాలకు తగ్గట్టుగా OTT సేవలను కస్టమైజ్ చేసుకునే అవకాశం లభించనుంది.
ఫిక్స్డ్ OTT బండిల్స్ కంటే యూజర్ ఛాయిస్‌కు ప్రాధాన్యత ఇవ్వడం ఈ ప్లాన్‌లో ప్రత్యేకత. టెలికాం, బ్రాడ్‌బ్యాండ్ రంగంలో వినియోగదారుల ఎంపికకు మరింత ప్రాధాన్యత పెరుగుతున్న సమయంలో BSNL తీసుకొచ్చిన ఈ విధానం కొత్త తరహా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ అనుభవాన్ని అందించే ప్రయత్నంగా చెప్పొచ్చు.
Also read:
