హిందూ సంప్రదాయంలో నాగ దేవతల ఆరాధనకు ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో నాగుల చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. (KarthikaMasam) కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే చవితి తిథిని నాగుల చవితిగా పరిగణిస్తారు. 2026లో ఈ పర్వదినాన్ని నవంబర్ 13, శుక్రవారం జరుపుకోనున్నారు.
నాగుల చవితి 2026 పూజా ముహూర్తం
పంచాంగ వివరాల ప్రకారం నవంబర్ 13న ఉదయం 11:01 గంటల నుంచి మధ్యాహ్నం 1:10 గంటల వరకు పూజకు శుభ సమయంగా సూచించారు. మొత్తం 2 గంటల 9 నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది. చవితి తిథి నవంబర్ 12 సాయంత్రం 6:09 గంటలకు ప్రారంభమై, నవంబర్ 13 రాత్రి 8:42 గంటలకు ముగుస్తుంది.

(KarthikaMasam) నాగుల చవితి ఎందుకు జరుపుకుంటారు?
ఈ పర్వదినాన మహిళలు తమ పిల్లలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని నాగ దేవతలను ప్రార్థిస్తారు. కుటుంబ క్షేమం, సర్పదోష నివారణ కలగాలని భక్తితో పూజలు నిర్వహిస్తారు.

నాగుల చవితి పూజా విధానం
పండుగ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి పూజకు సిద్ధమవుతారు. అనంతరం నాగ దేవతల ఆలయాలకు లేదా సురక్షితమైన పూజా ప్రదేశాలకు వెళ్లి పసుపు, కుంకుమ, పూలు సమర్పిస్తారు. పాలు, పండ్లు, నైవేద్యాలు సమర్పించి కుటుంబ సంక్షేమం కోసం ప్రార్థిస్తారు.

పూజించాల్సిన నాగ దేవతలు, మంత్రాలు
అనంతుడు, వాసుకి, శేషుడు, పద్ముడు, కర్కోటకుడు, తక్షకుడు, కాళీయుడు తదితర నాగ దేవతలను స్మరిస్తారు. ఈ సందర్భంగా సంప్రదాయ నాగ ప్రార్థనా మంత్రాలను పఠిస్తారు.

నాగుల చవితి ప్రకృతిలోని ప్రతి జీవిని గౌరవించాలని తెలియజేసే పర్వదినం. పాములను పట్టుకోవడం లేదా పాలు తాగించేందుకు బలవంతం చేయడం చేయకుండా, ఆలయాల్లో సురక్షితంగా పూజలు నిర్వహించడం మంచిది.
Also read:
