Secunderabad: ప్రయాణికులకు గుడ్‌న్యూస్

Secunderabad

Secunderabad

దీపావళి పండుగ ముగిసినా ప్రధాన నగరాల మధ్య రైళ్లలో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. (Secunderabad) సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య రెండు రైళ్లు, సికింద్రాబాద్‌-తిరుపతి మధ్య మరో రెండు రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 15, 16 తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి.

Good News For Passengers! Railways Scraps Flexi-Fare in 47 Trains, Offers  Discounts

సికింద్రాబాద్‌-విశాఖపట్నం ప్రత్యేక రైళ్లు

రైలు నంబర్ 08517 విశాఖపట్నం నుంచి నవంబర్ 15న మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నవంబర్ 16న రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.05 గంటలకు విశాఖపట్నం చేరుతుంది.

ఈ రైళ్లకు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, భీమడోలు టౌన్, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో హాల్టులు కల్పించారు. మొత్తం 19 కోచ్‌లు ఉంటాయి. వీటిలో 2 సెకండ్ ఏసీ, 4 థర్డ్ ఏసీ, 7 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

IRCTC Online Ticket Booking: Indian Railways guidelines for passengers  travelling on special trains - India TV News

(Secunderabad) సికింద్రాబాద్‌-తిరుపతి ప్రత్యేక రైళ్లు

తిరుపతి నుంచి రైలు నంబర్ 07421 నవంబర్ 15న సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 07422 నవంబర్ 16న సాయంత్రం 4.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు తిరుపతి చేరుతుంది.

ఈ రెండు రైళ్లకు రేణిగుంట, కోడూరు, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, కృష్ణ, యాద్గిర్, సెరాం, తాండూరు, వికారాబాద్, హైటెక్ సిటీ, బేగంపేట స్టేషన్లలో హాల్టులు ఉన్నాయి. ఈ రైళ్లలో 2 సెకండ్ ఏసీ, 6 థర్డ్ ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

IRCTC slammed for allotting upper berths to senior citizens | Today News

ప్రత్యేక రైళ్ల ద్వారా పండుగ అనంతరం స్వస్థలాలకు, ఉద్యోగ ప్రాంతాలకు తిరిగి వెళ్లే ప్రయాణికులకు కొంత ఊరట లభించనుంది. ప్రయాణానికి ముందు రైల్వే అధికారిక వెబ్‌సైట్ లేదా విచారణ కేంద్రంలో రైళ్ల సమయాలు, టికెట్ లభ్యతను నిర్ధారించుకోవడం మంచిది.

Also read: