Bengaluru: “హైదరాబాదే బెస్ట్

Bengaluru

Bengaluru

హైదరాబాద్ నగర రోడ్లు, ట్రాఫిక్ నిర్వహణపై మరోసారి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. (Bengaluru) బెంగళూరుకు చెందిన ఆర్చీ సేన్‌గుప్తా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. రెండు నగరాల్లో ప్రయాణ అనుభవాన్ని పోల్చుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో 12 కిలోమీటర్ల ప్రయాణాన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేశారట. అదే సమయంలో బెంగళూరులో 30 నిమిషాల ప్రయాణం అంటే కేవలం 1 కిలోమీటర్ మాత్రమే వెళ్లగలిగామని పేర్కొన్నారు. దీంతో హైదరాబాద్ రోడ్ల సౌకర్యం, ట్రాఫిక్ ప్లానింగ్‌పై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Beat Bengaluru Traffic: AI Renders Reveal Silk Board Skywalk Plan | Times  Now

ప్రస్తుతం ఐటీ రంగంలో హైదరాబాద్, (Bengaluru) బెంగళూరు నగరాలు ప్రధాన కేంద్రాలుగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్యల విషయంలో మాత్రం రెండు నగరాల మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో నిర్మించిన ఫ్లైఓవర్లు, విస్తరించిన రోడ్లు, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Hyderabad Traffic Live For Traffic Updates | LBB

ఆర్చీ సేన్‌గుప్తా చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. “హైదరాబాద్ రోడ్లు నిజంగానే బెస్ట్”, “సిటీలో డ్రైవింగ్ చాలా సౌకర్యంగా ఉంటుంది” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

Also read: