Sanjeev Kapoor: “పోహా హెల్తీ ఫుడ్ కాదు”

Sanjeev Kapoor

Sanjeev Kapoor

ప్రముఖ చెఫ్ మరియు ‘ఖానా ఖజానా’ ఫేమ్ (Sanjeev Kapoor) చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్రేక్‌ఫాస్ట్‌లలో ఒకటైన పోహాపై ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్‌గా మారాయి. “రైస్ చెడు అనుకుంటే పోహా ఇంకా చెడు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అనేక మందిని ఆశ్చర్యానికి గురి చేశాయి.

Serving up a storm: Meet celebrity chef Sanjeev Kapoor who adds a  flavourful punch to every home-cooked dish | YourStory

సంజీవ్ కపూర్ (Sanjeev Kapoor) అభిప్రాయం ప్రకారం పోహాలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండగా, ప్రోటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా ఉదయం సమయంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్పైక్స్ ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీని వల్ల కొంతసేపటికే మళ్లీ ఆకలి వేయడం, అలసట అనిపించడం వంటి సమస్యలు రావచ్చని ఆయన వివరించారు.

Tragedy is a qualification': Sanjeev Kapoor slams reality TV, refuses 'sob  story' for his upcoming biopic | Mint

భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పోహా ఎంతో ప్రాచుర్యం పొందిన అల్పాహారం. ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో పోహా-జిలేబీ కాంబో చాలా ప్రసిద్ధి చెందింది. అయితే ఈ కాంబినేషన్‌పై కూడా సంజీవ్ కపూర్ పరోక్షంగా విమర్శలు చేసినట్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. జిలేబీ, సేవ్ మరియు ఇతర ఫ్రైడ్ టాపింగ్స్ కలపడం వల్ల పోహా మరింత అన్‌హెల్తీగా మారుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Chef Sanjeev Kapoor| Speaker - Simply Life India Speakers Bureau

ఆయన మాటల ప్రకారం పోహాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, కానీ దానిని ఎలా తయారు చేస్తున్నామన్నది ముఖ్యమని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ నూనె, ఫ్రైడ్ టాపింగ్స్ మరియు తీపి పదార్థాలు కలపడం వల్లే సమస్య పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కలిపితే పోహాను కొంత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చని కూడా సూచిస్తున్నారు.

సంజీవ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆయన మాటలకు మద్దతు ఇస్తుండగా, మరికొందరు పోహా సరైన విధంగా తయారు చేస్తే ఆరోగ్యకరమైన అల్పాహారమేనని అంటున్నారు. ముఖ్యంగా ఫిట్‌నెస్ నిపుణులు, డైట్ ఎక్స్‌పర్ట్స్ కూడా ఈ అంశంపై చర్చ ప్రారంభించారు.

Travel Lens: Sanjeev Kapoor's World | National Geographic

ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి “పోహా నిజంగా హెల్తీనా కాదా?” అనే ప్రశ్నపై పెద్ద చర్చకు దారి తీశాయి. ఆరోగ్యకరమైన ఆహారం విషయంలో ప్రజలు ఇప్పుడు మరింత అవగాహనతో ఎంపికలు చేసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Also read: