Sony: మెడకు ధరించే ఏసీని

Sony

Sony

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య ప్రముఖ టెక్నాలజీ సంస్థ (Sony) వినూత్నమైన వేరబుల్ కూలింగ్ డివైస్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ‘Reon Pocket Pro Plus’ పేరుతో విడుదలైన ఈ కొత్త గ్యాడ్జెట్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణ ఏసీ లేదా కూలర్‌లకు భిన్నంగా ఇది మెడకు ధరించే విధంగా ప్రత్యేకంగా రూపొందించబడింది.

Sony Launches Wearable Air-Conditioner That'll Cost ~ ₹9,000 |  IndianWeb2.com

ఈ డివైస్‌లో పెల్టియర్ ఎఫెక్ట్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ ద్వారా మెడ చర్మ ఉష్ణోగ్రతను తగ్గించి శరీరానికి చల్లదనం అనుభూతి కలిగిస్తుంది. వేడి వాతావరణంలో బయట తిరిగే ఉద్యోగులు, ట్రావెలర్స్ మరియు ఎక్కువ సమయం బయట గడిపేవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది.

‘రియాన్ పాకెట్ ప్రో ప్లస్’లో అడ్జస్టబుల్ వెంట్స్, బిల్ట్-ఇన్ ఫ్యాన్ మరియు స్మార్ట్ సెన్సర్లు వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. యూజర్ శరీర ఉష్ణోగ్రత మరియు వాతావరణ పరిస్థితులను గుర్తించి ఆటోమేటిక్‌గా కూలింగ్ స్థాయిని సర్దుబాటు చేసే సామర్థ్యం కూడా ఇందులో ఉండొచ్చని సమాచారం. దీంతో అవసరానికి తగ్గట్టుగా కూలింగ్ అనుభవం లభిస్తుంది.

sony_ac1

ఈ డివైస్ మరో ముఖ్యమైన ప్రత్యేకత బ్యాటరీ బ్యాకప్. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే దాదాపు 10 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. దీర్ఘకాల ప్రయాణాలు లేదా ఆఫీస్ వర్క్ సమయంలో ఇది ఉపయోగపడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ (Sony) డివైస్ యూకే మరియు యూరప్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చింది. దీని ధర సుమారు 199 పౌండ్లు, అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.25,741 వరకు ఉంటుంది. భవిష్యత్తులో ఇతర దేశాల్లో కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.

Sony's latest quirky gadget is a wearable air conditioner | TechSpot

వాతావరణ మార్పులు మరియు పెరుగుతున్న వేడి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేరబుల్ కూలింగ్ డివైస్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సోనీ తీసుకొచ్చిన ఈ కొత్త “నెక్ ఏసీ” భవిష్యత్తులో మరింత ప్రాచుర్యం పొందే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also read: