Khushbu: 32 కిలోలు తగ్గిన ఖుష్బూ

Khushbu

Khushbu

(Khushbu) తన బరువు తగ్గిన విధానం, ఆరోగ్యకరమైన జీవనశైలి, కుటుంబ విలువల గురించి గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మూడు సంవత్సరాల క్రమశిక్షణతో ఆమె దాదాపు 32 కిలోల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఎలాంటి కఠినమైన జిమ్ వర్కౌట్స్ లేకుండా, సాధారణ జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ ఫిట్‌నెస్‌ను సాధించినట్లు తెలిపారు.

Bigg Boss Tamil: Khushbu intervenes and resolves the issue with FEFSI -  IBTimes India

జిమ్‌కు వెళ్లడం కంటే నడకకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని (Khushbu) Sundar చెప్పారు. ఆమె ప్రతి రోజు ఉదయం 45 నిమిషాలు, సాయంత్రం మరో 45 నిమిషాలు నడిచే అలవాటు పాటిస్తారు. హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్నప్పుడు ఈ దినచర్యను కచ్చితంగా కొనసాగిస్తానని తెలిపారు. గత కొన్ని నెలలుగా నడకకు విరామం వచ్చినప్పటికీ సాధారణంగా ఫిట్‌నెస్ విషయంలో క్రమశిక్షణ పాటిస్తానని చెప్పారు.

Disability rights groups demand action against Khushbu Sundar for insulting  persons with disabilities

ఆహారపు అలవాట్లలో కూడా ఆమె పెద్ద మార్పులు చేసుకున్నారు. జంక్ ఫుడ్‌ను పూర్తిగా తగ్గించడంతో పాటు ఫ్రైడ్ ఐటమ్స్, అధిక మసాలా మరియు పులుపు ఉన్న ఆహారాల నుంచి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా గ్లూటెన్ లేదా మైదాతో చేసిన పదార్థాలను పూర్తిగా మానేశానని వెల్లడించారు. టీ కేక్స్ అంటే చాలా ఇష్టమైనప్పటికీ ఆరోగ్యం కోసం వాటిని కూడా వదిలేశానని చెప్పారు.

Khushbu interview: 'I follow Karunanidhi's advice; DMK has forgotten it'

షుగర్‌ను పూర్తిగా మానకపోయినా, చాలా నియంత్రణలో తీసుకుంటానని తెలిపారు. చాక్లెట్లు చాలా అరుదుగా మాత్రమే తింటానని, అయితే ఐస్‌క్రీమ్‌లు మరియు భారతీయ స్వీట్లంటే తనకు ఎంతో ఇష్టమని నవ్వుతూ చెప్పారు. ఫ్యాడ్ డైట్స్ కంటే శరీరానికి ఏమి సరిపోతుందో అర్థం చేసుకుని జీవించడం వల్లే బరువు తగ్గడం సాధ్యమైందని ఆమె అభిప్రాయపడ్డారు.

Aranmanai' star Sundar C opens up on how his wife, actress-politician  Khushbu struggled with infertility - The Economic Times

Khushbu Sundar తన ఫ్యాషన్ స్టైల్ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పారు. రూ.200 నుంచి రూ.50,000 వరకు ధరలున్న చీరలు ధరిస్తానని తెలిపారు. ఒకే చీరను పలుమార్లు వాడుతూ కేవలం బ్లౌజ్ మార్చి కొత్త లుక్ ఇస్తానని చెప్పారు. భారీ ఆభరణాల కంటే పెద్ద చెవి కమ్మలు తనకు బాగా నప్పుతాయని పేర్కొన్నారు.

Here Is How Indian Politician And Actress Khushbu Sundar Lost 20 Kgs |  Herzindagi

కుటుంబం విషయానికి వస్తే, తన కుటుంబాన్ని కాపాడటంలో ఎంతో సున్నితంగా ఉంటానని తెలిపారు. కుటుంబ సభ్యుల గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే తాను “వుండెడ్ టైగ్రెస్”లా మారిపోతానని అన్నారు. తన భర్త Sundar C ఎంతో కష్టపడి ఎదిగిన వ్యక్తి అని ప్రశంసించారు. ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకుని సినిమాలు తీయడంలో ఆయన ప్రత్యేకత ఉందని చెప్పారు.

Also read: