(Michael)“మైఖేల్” సినిమా ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రారంభంలో కొంతమంది నుంచి నెగటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్ పెరుగుతుండటం ఆసక్తికరంగా మారింది.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, (Michael)“మైఖేల్” చిత్రం నార్త్ అమెరికా మార్కెట్‌లోనే దాదాపు 97 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూల్లు సాధించింది. ఈ వసూళ్లతో హాలీవుడ్ భారీ చిత్రం Avatar 3 ను కూడా దాటేసిందని ప్రచారం జరుగుతోంది. ఇది నిజంగా ఒక పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు.

ఇంటర్నేషనల్ మార్కెట్లలో కూడా ఈ సినిమా అదే రేంజ్‌లో దూసుకెళ్తోంది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు టాక్ వినిపిస్తోంది. విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే మొత్తం కలెక్షన్స్ 217 మిలియన్ డాలర్లను దాటినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది భారత కరెన్సీలో లెక్కిస్తే దాదాపు రూ.2,000 కోట్లకు పైగా అవుతుంది. ఈ స్థాయి వసూళ్లు సాధించడం చాలా అరుదైన విషయం. ముఖ్యంగా ప్రారంభంలో మిశ్రమ స్పందన వచ్చిన సినిమాకు ఈ స్థాయి గ్రోత్ రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సినిమా కంటెంట్, యాక్షన్ సీక్వెన్స్‌లు, మ్యూజిక్, విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో వసూళ్లు పెరుగుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వర్డ్ ఆఫ్ మౌత్ కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది.
ఇప్పటికే భారీ ఓపెనింగ్‌తో ప్రారంభమైన ఈ చిత్రం, వచ్చే రోజుల్లో ఇంకా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తుండటం గమనార్హం.
మొత్తానికి, “మైఖేల్” సినిమా ప్రారంభంలో ఎదురైన నెగటివ్ టాక్‌ను అధిగమించి బాక్సాఫీస్ వద్ద అద్భుత ప్రదర్శన చేస్తూ ఇండస్ట్రీలో కొత్త రికార్డులకు నాంది పలుకుతోంది.
Also read:
