(OTT) ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే జానర్లలో సస్పెన్స్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామాలకు ప్రత్యేక స్థానం ఉంది. కొత్త కథనం, ఆసక్తికరమైన మలుపులతో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో (OTT) ఓటీటీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ‘బబితా సింగ్ రిపోర్టింగ్’ సినిమా క్రైమ్ థ్రిల్లర్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ విషయానికి వస్తే.. బేబీ అనే పోలీస్ అధికారిణి చుట్టూ సినిమా కథ సాగుతుంది. ఉద్యోగంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ పలు సమస్యలను ఎదుర్కొంటున్న ఆమెకు ఓ కుటుంబ కార్యక్రమం కోసం సెలవు అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో ఓ బూటకపు కేసు బాధ్యత తీసుకుని మధ్యప్రదేశ్‌లోని రేవాకు వెళ్తుంది. అక్కడ ఆమె తన చిన్ననాటి స్నేహితుడు బన్సీని కలుస్తుంది. అయితే అదే రాత్రి బన్సీ హత్యకు గురవడంతో బేబీ జీవితంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి.
&im=FitAndFill=(700,400))
స్థానిక పోలీసుల నుంచి ఆశించిన సహకారం లభించకపోవడంతో బేబీ స్వయంగా హత్య కేసును ఛేదించాలని నిర్ణయించుకుంటుంది. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ ఆమెకు అనేక కుటుంబ రహస్యాలు, మోసాలు, ద్రోహాలు ఎదురవుతాయి. హత్య చేసిన వ్యక్తి ఎవరు? అసలు ఈ నేరం వెనుక కారణం ఏమిటి? దర్యాప్తులో బేబీకి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే ప్రశ్నలు కథను ముందుకు నడిపిస్తాయి.
ఈ సినిమాలో క్రైమ్ మిస్టరీతో పాటు మహిళా పోలీస్ అధికారిణి ఎదుర్కొనే వ్యక్తిగత, కుటుంబ సమస్యలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. ఇంట్లో నిర్లక్ష్యం, కార్యాలయంలో పురుషాధిక్య ధోరణి వంటి అంశాలను కథలో చూపించారు. బేబీ పాత్రలో నిమిషా సజ్యాన్ తన నటనతో ఆకట్టుకున్నారని ప్రశంసలు వస్తున్నాయి. పాత్రలోని అభద్రత, సంఘర్షణ, ఆత్మవిశ్వాసం పెరిగే విధానాన్ని ఆమె చక్కగా చూపించారని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

బరున్ సోబ్తి, అన్షుమాన్ పుష్కర్, రాజేష్ కుమార్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ కలహాలు, పోలీస్ దర్యాప్తు, హత్య మిస్టరీతో ఈ సినిమా సాగుతుంది.
‘బబితా సింగ్ రిపోర్టింగ్’ 28 ఆగస్టు 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ కథలను ఇష్టపడే వారికి ఈ చిత్రం ఓటీటీలో ఆసక్తికరమైన ఎంపికగా నిలుస్తోంది.
Also read:
- Udaya Bhanu: వేణుమాధవ్‌ను గుర్తుచేసుకుని ఎమోషనల్
- Holidays: విద్యార్థులకు గుడ్‌న్యూస్ 4 రోజులు సెలవులు!
