సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, నటి (Sandeepa సందీపా విర్క్ తన జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. రూ.6 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి సుమారు నాలుగున్నర నెలలు ఢిల్లీలోని తీహార్ జైలులో గడిపినట్లు ఆమె తెలిపారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె.. జైలు జీవితం, అక్కడ ఎదురైన పరిస్థితుల గురించి పలు విషయాలను వెల్లడించారు.
తీహార్ జైలులో ఖైదీలను తనిఖీ చేసే విధానం తనకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించిందని (Sandeepa) సందీపా విర్క్ ఆరోపించారు. జైలులోకి ప్రవేశించే సమయంలో సిబ్బంది దుస్తులు తొలగించి శరీరాన్ని తనిఖీ చేసేవారని, ప్రైవేట్ భాగాల వద్ద టార్చ్ లైట్‌తో కూడా పరిశీలించేవారని ఆమె పేర్కొన్నారు. చలికాలంలోనూ ఇలాంటి తనిఖీలు జరిగేవని చెప్పుకొచ్చారు.
ఒక రోజులో రెండు నుంచి మూడు సార్లు దుస్తులు తొలగించి తనిఖీలు చేసేవారని, ఇలాంటి తనిఖీలు తనకు తీవ్ర అవమానంగా అనిపించేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత కఠినంగా తనిఖీలు జరుగుతున్నప్పటికీ జైలులోకి మొబైల్ ఫోన్లు, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు ఎలా చేరుతున్నాయని ప్రశ్నించారు. డబ్బు ఉంటే జైలులో కొన్ని విషయాలు సాధ్యమవుతాయనే అభిప్రాయాన్ని కూడా ఆమె వ్యక్తం చేశారు.
అదే సమయంలో జైలులో ఆహారం, టాయిలెట్లు పరిశుభ్రంగా ఉండేవి కావని ఆమె ఆరోపించారు. మొదటి రోజే 25-26 మంది ఉన్న గదిలో ఉంచారని గుర్తుచేసుకున్నారు. నిరంతర మానసిక ఒత్తిడి, వేధింపులు తట్టుకోలేక జైలులో ఉన్న సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చినట్లు కన్నీటిపర్యంతమయ్యారు.
Also read:
