ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతా ఉంటుంది. ఉద్యోగి జీతం నుంచి ప్రతి నెలా 12 శాతం మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. యాజమాన్యం కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ డబ్బుపై కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి వడ్డీని జమ చేస్తుంది.ప్రస్తుతం 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25 శాతంగా నిర్ణయించారు.
అయితే చాలా మంది ఉద్యోగులకు వడ్డీ డబ్బులు ఖాతాలో జమ అయ్యాయా లేదా అనే సందేహం ఉంటుంది. దీనిని సులభంగా ఆన్లైన్లో లేదా మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.
PF బ్యాలెన్స్ చెక్ చేసుకునే 4 మార్గాలు
1. (EPFO)వెబ్సైట్ ద్వారా
- EPFO అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి.
- UAN నంబర్, పాస్వర్డ్ నమోదు చేయాలి.
- “Passbook” ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అక్కడ మీ నెలవారీ కాంట్రిబ్యూషన్లు, మొత్తం బ్యాలెన్స్, వడ్డీ జమ వివరాలు కనిపిస్తాయి.
2. UMANG యాప్ ద్వారా
- గూగుల్ ప్లే స్టోర్ నుంచి UMANG యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.
- మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
- EPFO సేవలను ఎంచుకోవాలి.
- “Employee Centric Services” లోకి వెళ్లి UAN నమోదు చేయాలి.
- OTP వెరిఫికేషన్ తర్వాత బ్యాలెన్స్ వివరాలు చూడవచ్చు.
3. SMS ద్వారా
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి:
EPFOHO UAN TEL
అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు SMS పంపాలి.
ఇక్కడ:
- UAN స్థానంలో మీ UAN నంబర్ నమోదు చేయాలి.
- TEL అంటే తెలుగు భాష.
- ENG, HIN వంటి ఇతర భాషల కోడ్లు కూడా ఉపయోగించవచ్చు.
4. మిస్డ్ కాల్ ద్వారా
మీ UAN నంబర్ ఆధార్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉంటే:
9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి.
కొన్ని క్షణాల్లోనే SMS ద్వారా PF బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.
PF వడ్డీ ఆలస్యంగా జమైతే టెన్షన్ అవసరమా?
అసలు అవసరం లేదు. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత EPFO వడ్డీని జమ చేస్తుంది. కొన్నిసార్లు ప్రక్రియ ఆలస్యమైనా, సభ్యులకు రావాల్సిన పూర్తి వడ్డీ మొత్తాన్ని ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి వడ్డీ క్రెడిట్ ఆలస్యమైందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ముఖ్య సూచన
ప్రతి ఉద్యోగి కనీసం నెలకు ఒకసారి తన PF పాస్‌బుక్‌ను పరిశీలించడం మంచిది. దీంతో యాజమాన్యం ప్రతి నెలా PF కాంట్రిబ్యూషన్ జమ చేస్తుందా లేదా, వడ్డీ సక్రమంగా పడుతోందా అనే విషయాలు తెలుసుకోవచ్చు.
Also read:
