India: భారత్‌లో నేను ఏడ్చాను

India

India

భారతదేశం (India) అంతటా ఒంటరిగా ప్రయాణించిన ఓ ఆఫ్రికన్ యువకుడి భావోద్వేగ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫైనాన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన Hunch అనే యువకుడు భారత్ పర్యటన తన జీవితాన్ని ఆలోచించే విధానాన్నే మార్చేసిందని చెప్పాడు.

(India) భారత్‌లోని అనేక ప్రాంతాలను సందర్శించిన తర్వాత ఒక సందర్భంలో తాను భావోద్వేగానికి గురై ఏడ్చానని, కానీ ఎందుకు అలా జరిగిందో పూర్తిగా అర్థం కాలేదని తెలిపాడు. “ఇది కేవలం ఒక దేశం కాదు.. ఊహతో ఒక నాగరికతను నిర్మించినట్టుగా అనిపించింది” అంటూ చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

భారతీయ సంస్కృతి, ఆలయాలు, ప్రజల జీవనశైలి, ఆధ్యాత్మిక వాతావరణం తనపై గాఢమైన ప్రభావం చూపాయని అతను వెల్లడించాడు. ముఖ్యంగా ఇక్కడ కనిపించే ఆధ్యాత్మికత, పురాతన చరిత్ర, వైవిధ్యమైన సంప్రదాయాలు తనలో కొత్త ఆలోచనలకు దారితీశాయని చెప్పాడు.

అలాగే బ్రిటిష్ పాలన సమయంలో దేశం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, భారతీయ సంస్కృతి పూర్తిగా నశించకుండా నిలబడటం తనకు ఆశ్చర్యం కలిగించిందని పేర్కొన్నాడు. “ఎంతో దోపిడీ జరిగినా ఈ నాగరికత తన అసలైన శక్తిని కోల్పోలేదు” అని చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

Indiaపై విదేశీయుల అభిప్రాయాలు సోషల్ మీడియాలో తరచూ చర్చకు వస్తుంటాయి. అయితే ఈ యువకుడు చెప్పిన భావోద్వేగ అనుభవాలు మాత్రం అనేక మందిని ఆలోచింపజేస్తున్నాయి.

నెటిజన్లు కూడా అతని వ్యాఖ్యలపై స్పందిస్తూ, భారతదేశ ప్రత్యేకత ఆధ్యాత్మికత, సంస్కృతి, మానవ సంబంధాల్లోనే ఉందని కామెంట్లు చేస్తున్నారు. కొందరు “భారత్‌ను అనుభవిస్తేనే అర్థమవుతుంది” అంటూ పోస్టులు పెడుతున్నారు.

Also read: