Cantonment: బ్రిటిష్ పేర్లకు గుడ్‌బై!

Cantonment

Cantonment

బ్రిటిష్ పాలనకు గుర్తుగా మిగిలిపోయిన రోడ్ల పేర్లకు (Cantonment) కంటోన్మెంట్ బోర్డు గుడ్‌బై చెప్పింది. బానిసత్వపు ఆనవాళ్లను తొలగించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంటూ, పలు రహదారులు మరియు బజార్లకు భారత వీర జవాన్లు, జాతీయ నాయకులు, మహనీయుల పేర్లను నామకరణం చేసింది. ఈ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.

దశాబ్దాలుగా కొనసాగుతున్న బ్రిటిష్ కాలం నాటి రోడ్ల పేర్లను మార్చి(Cantonment) భారతీయుల గర్వకారణమైన వ్యక్తుల పేర్లను పెట్టడం ద్వారా దేశభక్తి, చారిత్రక గౌరవాన్ని ప్రతిబింబించే ప్రయత్నం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ మార్పులు స్థానిక ప్రజలతో పాటు దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి సానుకూల స్పందనను అందుకుంటున్నాయి.

కొత్తగా ప్రకటించిన పేర్లలో వెల్లింగ్టన్ రోడ్డుకు కార్గిల్ యుద్ధ వీరుడు Captain Vikram Batra పేరు పెట్టి “కెప్టెన్ విక్రమ్ బాత్రా రోడ్”గా మార్చారు. బర్టన్ రోడ్డుకు Bikkumalla Santosh Babu పేరు పెట్టి “కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు రోడ్”గా నామకరణం చేశారు.

అదే విధంగా ప్యాట్నీ రోడ్డుకు Ardeshir Burzorji Tarapore పేరు, బోల్టన్ రోడ్డుకు Atal Bihari Vajpayee పేరు, నోబెల్ రోడ్డుకు A. P. J. Abdul Kalam పేరు కేటాయించారు.

రిచర్డ్‌సన్ రోడ్డును Sandeep Unnikrishnan రోడ్‌గా, లిట్టన్ రోడ్డును Subhas Chandra Bose రోడ్‌గా మార్చారు. అలాగే కార్న్‌వాలిస్ రోడ్డుకు Swami Vivekananda మార్గ్ అనే పేరు పెట్టారు.

గౌహ్ రోడ్డును Somnath Sharma పేరుతో, బ్యామ్ రోడ్డును పరమహంస మార్గ్‌గా, ఎంప్రెస్ రోడ్డును వీరనారీ మార్గ్‌గా నామకరణం చేశారు.

ఈ నిర్ణయం ద్వారా దేశ చరిత్రలో విశిష్ట సేవలు అందించిన వీర జవాన్లు, స్వాతంత్ర్య సమరయోధులు, జాతీయ నాయకుల సేవలను గుర్తు చేసుకునే అవకాశం కలుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బ్రిటిష్ పాలనను గుర్తుచేసే పేర్ల స్థానంలో భారతీయుల గర్వకారణమైన మహనీయుల పేర్లు రావడం దేశభక్తి భావనను మరింత బలోపేతం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Also read: