Telangana: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్!

Telangana

Telangana

(Telangana) తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మాతా–శిశు ఆరోగ్య సేవల అమలులో రాష్ట్రం కనబరిచిన మెరుగైన పనితీరును గుర్తిస్తూ తెలంగాణకు అదనంగా రూ.200 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాతా శిశు సంరక్షణ సేవలను మరింత ఆధునికీకరించడంతో పాటు వైద్య మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

We are grateful to the Hon'ble Chief Minister of Telangana, Anumula Revanth  Reddy, for inaugurating the Medical Care Unit in Hyderabad, launched by  Smile Foundation in collaboration with HDFC Bank under its

హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కేంద్రం మంజూరు చేసిన ఈ ప్రత్యేక నిధులను పూర్తిగా మాతా–శిశు సంక్షేమ కార్యక్రమాలకే వినియోగించనున్నారు. గర్భిణీలకు, నవజాత శిశువులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడమే ఈ నిధుల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ నిధులతో (Telangana) రాష్ట్రంలోని ఎంపిక చేసిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో లేబర్ రూమ్స్, ఆపరేషన్ థియేటర్లను అత్యాధునిక సదుపాయాలతో అభివృద్ధి చేయనున్నారు. అలాగే నవజాత శిశువుల సంరక్షణ కోసం ప్రత్యేక నియోనేటల్ కేర్ యూనిట్లను విస్తరించనున్నారు. మదర్ కేర్ వార్డులు, మిడ్‌వైఫరీ లెడ్ కేర్ యూనిట్లు, లాక్టేషన్ మేనేజ్‌మెంట్ యూనిట్లు వంటి ప్రత్యేక సేవలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అంతేకాకుండా, ఎక్కువ ప్రసవాలు జరిగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణీల ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక వైద్య పరికరాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్ (IPHS) ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేసి, నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ సర్టిఫికేషన్ పొందేలా చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.

మాతృ మరణాలు, నవజాత శిశు మరణాల రేటును తగ్గించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా ఉందని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రతి గర్భిణీకి, పుట్టిన ప్రతి శిశువుకు ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఈ నిధులు ఉపయోగపడతాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల వరకు మెరుగైన మాతా–శిశు ఆరోగ్య సేవలు చేరేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నారు.

జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఈ గుర్తింపు రాష్ట్ర వైద్య సిబ్బంది సమిష్టి కృషికి నిదర్శనమని అధికారులు తెలిపారు. వైద్యులు, నర్సులు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్లే రాష్ట్రం ఈ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు. కేంద్రం నుంచి లభించిన అదనపు నిధులు ఆరోగ్య రంగంలో మరిన్ని సంస్కరణలకు దోహదపడతాయని, ప్రజలకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందేలా ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

Also read: