నమోదవుతుండటంతో అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక కరోనా వార్డులు, ప్రత్యేక ఓపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, అయితే జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
(Andhra Pradesh) గుంటూరు జిల్లా ఎయిమ్స్ పరిసర ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తొలుత మంగళగిరి, నవులూరుకు చెందిన ఇద్దరు మహిళలకు కరోనా నిర్ధారణ అయింది. వారిలో ఒకరు కేరళకు చెందిన మహిళ కాగా, గత కొన్నేళ్లుగా నవులూరులో నివసిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో హోం ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అనంతరం కృష్ణా జిల్లాకు చెందిన మరో మహిళకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆమెకు ఎయిమ్స్‌లో వైద్యం అందించారు.
తర్వాత దుగ్గిరాల, చినకాకానికి చెందిన మరో ఇద్దరికి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరికి కూడా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తూ హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. దీంతో ఎయిమ్స్‌లో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే సమయంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో బాపట్ల జిల్లాకు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు.
ప్రతి రోజు కొత్త కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జీజీహెచ్‌లో ప్రత్యేక వార్డుతో పాటు ప్రత్యేక ఓపీ ఏర్పాటు చేశారు. అలాగే ఎయిమ్స్‌లో ప్రత్యేక ఫీవర్ వార్డును సిద్ధం చేశారు. ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వేరియంట్ తీవ్ర ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నప్పటికీ, వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
వైద్య నిపుణుల సూచనల ప్రకారం జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే కరోనా పరీక్ష చేయించుకోవాలి. అలాగే మాస్క్ ధరించడం, చేతులను తరచూ శుభ్రం చేసుకోవడం, శానిటైజర్ వినియోగించడం, రద్దీ ప్రాంతాల్లో జాగ్రత్తలు పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా వైరస్ వ్యాప్తిని తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉండటం అత్యంత ముఖ్యమని వైద్య శాఖ స్పష్టం చేసింది. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సలహా తీసుకోవడం, స్వీయ చికిత్సకు దూరంగా ఉండడం, హోం ఐసోలేషన్ నిబంధనలు పాటించడం ద్వారా కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Also read:
