(TGSRTC) ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో జరిగే చోరీలు, వేధింపులు, అనుమానాస్పద ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యాధునిక సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చింది.
“బస్సులో భరోసా” పేరుతో రూపొందించిన ఈ హైటెక్ భద్రతా ప్రాజెక్టును తొలి దశలో Adilabad districtలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ఈ వ్యవస్థను అమలు చేస్తున్నారు.
ప్రస్తుతం ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని సుమారు 175 బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డ్రైవర్ క్యాబిన్ నుంచి బస్సు చివరి సీటు వరకు, మహిళల కోసం కేటాయించిన సీట్లు, ఫుట్‌బోర్డ్ ప్రాంతాలు సహా ప్రతి మూలను కవర్ అయ్యేలా కెమెరాలను అమర్చారు.
ఈ కెమెరాల ద్వారా బస్సులో జరిగే ప్రతి కదలిక రికార్డు అవుతుంది. విజువల్స్ డ్రైవర్, కండక్టర్‌కు అందుబాటులో ఉండటమే కాకుండా, ఆర్టీసీ కంట్రోల్ రూమ్ నుంచే నిరంతరం పర్యవేక్షించే విధంగా కనెక్ట్ చేశారు.
(GSRTC) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వ్యవస్థ వల్ల దొంగతనాలు చేసే ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రమాదాలు లేదా అవాంఛనీయ ఘటనలు జరిగినప్పుడు స్పష్టమైన ఆధారాలు సేకరించడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఈ నిర్ణయం ఎంతో ఉపయోగకరమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే మహిళలు, వృద్ధులు ఈ సీసీ కెమెరాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక బస్సుల్లో కెమెరాలు ఉండటంతో డ్రైవర్లు, సిబ్బంది కూడా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని అధికారులు భావిస్తున్నారు. డ్రైవింగ్ ప్రమాణాలు కూడా మెరుగుపడే అవకాశముందని చెబుతున్నారు.
ఆదిలాబాద్‌లో ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల బస్సులకు ఈ సీసీ కెమెరా వ్యవస్థను విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు సమాచారం.
Also read:
