BillGates: వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చ!

BillGates

BillGates

ప్రపంచ టెక్ దిగ్గజం, (Bill Gates) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట ఇచ్చిన వాంగ్మూలం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్‌తో తన గత పరిచయాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా గేట్స్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించాయి.

అమెరికా హౌస్ ఓవర్‌సైట్ కమిటీ నిర్వహించిన క్లోజ్డ్-డోర్ విచారణలో బిల్ గేట్స్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ప్రస్తావించినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ సందర్భంగా గతంలో ముగ్గురు మహిళలతో తనకు సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. ఈ విచారణలో రష్యన్ బ్రిడ్జ్ ప్లేయర్ మిలా ఆంటోనోవా, అణు శాస్త్రవేత్త కరీమా నిగ్మతులినా, వైద్య రంగానికి చెందిన అలిస్ జాకబ్స్ నెసెల్‌రోట్ పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

Bill Gates testifies before House panel investigating Epstein - The Washington Post

విచారణ సందర్భంగా జెఫ్రీ ఎప్స్టీన్‌తో తనకు 2011 నుంచి 2014 మధ్య పలుమార్లు సమావేశాలు జరిగినట్లు గేట్స్ వివరించారు. ఈ సమావేశాల ప్రధాన ఉద్దేశం దాతృత్వ కార్యక్రమాలకు నిధుల సమీకరణ అవకాశాలను పరిశీలించడమేనని ఆయన చెప్పారు. అయితే ఎప్స్టీన్‌తో సంబంధాలు కొనసాగించడం తన జీవితంలో “తీవ్రమైన తీర్పు పొరపాటు”గా అభివర్ణించారు.

అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమాచారం ఎప్స్టీన్‌కు తెలిసి ఉండేదని, ఆ విషయాలను ఉపయోగించి తనపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించిన సందర్భాలు ఉన్నాయని గేట్స్ పేర్కొన్నట్లు సమాచారం. అయితే ఎలాంటి అక్రమ చర్యల్లో తాను పాల్గొనలేదని, ఎప్స్టీన్ నేర కార్యకలాపాల గురించి తనకు అప్పట్లో అవగాహన లేదని స్పష్టం చేశారు.

Bill Gates testifies about his ties to Epstein, calls meeting him a 'grave error in judgment' | Nation & World | journal-news.com

ఈ వాంగ్మూలం బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా విస్తృత చర్చ మొదలైంది. కొందరు (Bill Gates) గేట్స్ నిజాయితీగా స్పందించారని అభిప్రాయపడుతుండగా, మరికొందరు ఎప్స్టీన్ వ్యవహారంలో మరిన్ని ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే ఇప్పటివరకు బిల్ గేట్స్‌పై ఎలాంటి క్రిమినల్ ఆరోపణలు నిరూపించబడలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ కమిటీ విచారణ కొనసాగుతుండగా, ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also read: