Rajiv Gandhi International Airportలో ఎబోలా (Ebola) వైరస్ అప్రమత్తత చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాట్లు చేపట్టారు.
అంతర్జాతీయ రాకపోకల టెర్మినల్స్ వద్ద థర్మల్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేశారు. ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలను థర్మల్ స్కానర్ల ద్వారా పరిశీలిస్తూ ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.
ప్రత్యేకంగా (Ebola) ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై మరింత జాగ్రత్తగా పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. జ్వరం, అలసట, వాంతులు లేదా ఇతర అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య బృందాలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు.
![]()
World Health Organization హెచ్చరికల నేపథ్యంలో ఈ జాగ్రత్త చర్యలను మరింత బలోపేతం చేసినట్లు అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో ప్రత్యేక వైద్య బృందాలు, ఐసోలేషన్ సదుపాయాలను కూడా సిద్ధంగా ఉంచారు.
ప్రయాణికులు భయపడాల్సిన అవసరం లేదని, కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ స్క్రీనింగ్ నిర్వహిస్తున్నట్లు ఆరోగ్య అధికారులు స్పష్టం చేశారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Hyderabadలోని ఆరోగ్య శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎబోలా కేసులు నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు.
Also read:
