Dhoole Peta: సంచలనం సృష్టిస్తున్న తెలుగు క్రైమ్ థ్రిల్లర్

Dhoole Peta

Dhoole Peta

(Dhoole Peta) ప్రస్తుతం ఓటీటీ ప్రపంచాన్ని  క్రైమ్ థ్రిల్లర్ కథలే శాసిస్తున్నాయి. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అన్న తేడా లేకుండా ప్రేక్షకులు ఎక్కువగా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఆసక్తికరమైన కథనం, సస్పెన్స్, ఊహించని ట్విస్టులతో వచ్చే కంటెంట్‌కు భారీ ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో తెలుగు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోన్న క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్” ఇప్పుడు అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

(Dhoole Peta) Police Station ప్రస్తుతం ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. స్ట్రీమింగ్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఈ సిరీస్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో తెరకెక్కిన కథ, ప్రతి ఎపిసోడ్‌లో ఉత్కంఠ రేపే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ ఏకంగా 250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలను దాటడం విశేషంగా మారింది.

Dhoolpet Police Station Series OTT : ఓటీటీలోకి థ్రిల్లర్ సిరీస్ 'ధూల్‌పేట్  పోలీస్ స్టేషన్' - మొత్తం 50 ఎపిసోడ్స్... ఎందులో స్ట్రీమింగ్ అంటే? |  Dhoolpet Police station web ...

ఈ సిరీస్ కథ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతంలోని ఓ బస్తీలో ఒకే రాత్రి మూడు హత్యలు జరగడం కలకలం రేపుతుంది. వరుస హత్యలతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతారు. దీంతో ఈ కేసును ఛేదించేందుకు ఇద్దరు తెలివైన పోలీస్ అధికారులు రంగంలోకి దిగుతారు. తమదైన స్టైల్‌లో విచారణ మొదలుపెట్టిన వారు, దర్యాప్తులో సంచలన విషయాలను బయటపెడతారు. హత్యల వెనుక ఉన్న అసలు మిస్టరీ ఏంటి? క్షుద్ర పూజలు, నరబలులతో ఈ కేసుకు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నల చుట్టూ కథ ఉత్కంఠభరితంగా సాగుతుంది.

ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు Jashwini తెరకెక్కించారు. ఇందులో Ashwin, Sreethu, Padini Kumar, Guru, Preethi Sharma తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 50 ఎపిసోడ్స్‌తో రూపొందిన ఈ సిరీస్‌లో ప్రతి ఎపిసోడ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతూ ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేస్తుంది.

Dhoolpet Police Station OTT Release: Streaming Date, Platform & Full Crime  Thriller Details | Where to Watch Dhoolpet Police Station Online: OTT  Release, Plot, Cast & Episodes | Dhoolpet Police Station Series

ఈ భారీ విజయంపై AhaOTTసోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టు చేసింది. “250 మిలియన్లకు పైగా స్ట్రీమింగ్ నిమిషాలతో ధూల్‌పేట్ పోలీస్ స్టేషన్ తన విజయయాత్రను కొనసాగిస్తోంది. ఓటీటీ ప్రపంచంలోనే అతిపెద్ద లాంగ్ ఫార్మాట్ క్రైమ్ సిరీస్‌లలో ఒకటిగా రికార్డులు సృష్టిస్తోంది” అంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ సిరీస్ తెలుగు ఓటీటీ ప్రేక్షకుల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.

Also read: