E20: పెట్రోల్ వాడితే వాహన ఇన్సూరెన్స్ చెల్లద

E20

E20

దేశంలో పర్యావరణ పరిరక్షణ, చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం(E20Petrol) E20 పెట్రోల్ వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. E20 అంటే 20 శాతం ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపిన ఇంధనం. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ ఇంధన వినియోగంపై మరింత దృష్టి పెట్టడంతో వాహనదారుల్లో పలు సందేహాలు తలెత్తాయి. ముఖ్యంగా E20 పెట్రోల్ వాడితే వాహన బీమా చెల్లదా? క్లెయిమ్‌లు తిరస్కరించబడతాయా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీశాయి.

Car Insurance : మీ పాత కారులో E20 పెట్రోల్ పోస్తే, మీకు ఇన్సూరెన్స్ రాదా.?  | e20 petrol insurance claim old cars india

కొంతకాలంగా పాత కార్లు, బైకులు (E20Petrol) E20 ఇంధనానికి పూర్తిగా అనుకూలంగా ఉండకపోవచ్చని, దీంతో ఇంజిన్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో E20 పెట్రోల్ వాడటం వాహనదారుల నిర్లక్ష్యంగా పరిగణించి బీమా కంపెనీలు క్లెయిమ్‌లను తిరస్కరిస్తాయనే వాదనలు కూడా వినిపించాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని బీమా రంగ సంస్థలు స్పష్టం చేశాయి.

ప్రధాన బీమా సంస్థలలో ఒకటైనICICI Lombard General Insuranceఈ అంశంపై స్పష్టత ఇచ్చింది. E20 పెట్రోల్ వినియోగం వల్ల మోటార్ ఇన్సూరెన్స్ పాలసీ చెల్లుబాటుపై ఎలాంటి ప్రభావం ఉండదని పేర్కొంది. పాత వాహనాల్లో E20 పెట్రోల్ వాడటాన్ని నిర్లక్ష్యంగా పరిగణించబోమని కూడా స్పష్టం చేసింది.

E20 Petrol: పెట్రోల్ వాహనదారులకు షాక్.. ఇకపై దేశవ్యాప్తంగా E20 పెట్రోల్  తప్పనిసరి, ఎప్పటినుంచంటే? | బిజినెస్ - News18 Telugu

మోటార్ వాహన బీమా పాలసీలు ప్రధానంగా ప్రమాదాలు, దొంగతనాలు, వాహన నష్టం, థర్డ్ పార్టీ బాధ్యతలు, వ్యక్తిగత ప్రమాద కవరేజ్ వంటి అంశాల ఆధారంగా పనిచేస్తాయి. వాహనంలో ఉపయోగించే ఇంధనం ఏదన్నది సాధారణంగా క్లెయిమ్ మంజూరులో ప్రధాన ప్రమాణం కాదు. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ లేదా E20 పెట్రోల్ ఏది ఉపయోగించినా బీమా రక్షణ కొనసాగుతుందని బీమా సంస్థలు చెబుతున్నాయి.

అయితే వాహన తయారీదారు సూచించిన ఇంధన ప్రమాణాలను పాటించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా 2023కు ముందు తయారైన కొన్ని వాహనాల విషయంలో E20 అనుకూలతపై కంపెనీ మార్గదర్శకాలను పరిశీలించడం అవసరం. ఇది వాహన పనితీరు మరియు దీర్ఘకాలిక ఇంజిన్ ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.

E20 Petrol: ఇకపై బంకుల్లో E20 ఫ్యూయల్ మాత్రమే.. పాత పెట్రోల్‌కి దీనికి తేడా  తెలియకుండా బండికి కొట్టిస్తున్నారా? | - News18 Telugu

మొత్తం మీద E20 పెట్రోల్ వాడటం వల్ల వాహన బీమా రద్దవుతుందనే ప్రచారం అవాస్తవమని స్పష్టమైంది. వాహనదారులు సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సమాచారాన్ని నమ్మకుండా, అధికారిక సంస్థల ప్రకటనలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also read: