2026లో విద్యార్థులు, ఆన్లైన్ లెర్నింగ్ చేసేవారు, రోజువారీ అవసరాల కోసం laptops కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్రతి ల్యాప్‌టాప్ అందరికీ సరిపోదు. ముఖ్యంగా Windows, ChromeOS, Android ఆధారిత ల్యాప్‌టాప్‌ల మధ్య తేడాలను అర్థం చేసుకుని కొనుగోలు చేయడం చాలా ముఖ్యం. తాజా రివ్యూలు, పనితీరు, ఫీచర్ల ఆధారంగా 2026లో విద్యార్థులకు అనువైన బెస్ట్ బడ్జెట్ ల్యాప్‌టాప్‌ల జాబితా ఇదే.
ఈ జాబితాలో Acer Aspire One Ryzen 3 7320U మొదటి స్థానంలో నిలిచింది. 4.7/5 రేటింగ్ పొందిన ఈ ల్యాప్‌టాప్‌ను Editor’s Choiceగా ఎంపిక చేశారు. Ryzen 3 7320U ప్రాసెసర్, LPDDR5 RAM, Windows 11, SSD స్టోరేజ్ వంటి ఫీచర్లు దీనిని విద్యార్థులు, కోడింగ్ నేర్చుకునేవారు, MS Office వినియోగదారులు, రోజువారీ మల్టీటాస్కింగ్ చేసే వారికి అద్భుతమైన ఎంపికగా నిలబెడుతున్నాయి. అయితే HD డిస్ప్లే మాత్రమే ఉండటం ఒక చిన్న లోపం. అయినప్పటికీ ఈ జాబితాలోని అత్యుత్తమ Windows ల్యాప్‌టాప్‌గా ఇది గుర్తింపు పొందింది.

రెండో స్థానంలో ASUS Chromebook CX1405 నిలిచింది. 4.3/5 రేటింగ్ పొందిన ఈ Chromebook Google Workspace, వెబ్ బ్రౌజింగ్, ఆన్లైన్ క్లాసులు, క్లౌడ్ ఆధారిత పనులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ChromeOS వేగంగా పనిచేయడం, FHD డిస్ప్లే, ASUS బిల్డ్ క్వాలిటీ, మంచి బ్యాటరీ దీని ప్రధాన బలాలు. అయితే Chromebook అంటే Windows ల్యాప్‌టాప్ కాదని గుర్తుంచుకోవాలి. ఇందులో సాధారణ Windows సాఫ్ట్వేర్లను ఇన్స్టాల్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి Google సేవలను ఎక్కువగా ఉపయోగించే వారికి మాత్రమే ఇది మంచి ఎంపిక.

మూడో స్థానంలో Primebook 2 Max (2026) ఉంది. 4.1/5 రేటింగ్ పొందిన ఈ Android ఆధారిత PrimeOS ల్యాప్‌టాప్‌లో 15.6 అంగుళాల FHD IPS డిస్ప్లే, 256GB స్టోరేజ్, మంచి బ్యాటరీ, బ్యాక్లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆన్లైన్ లెర్నింగ్, వీడియోలు చూడడం, OTT, ఆన్లైన్ మీటింగ్‌లకు ఇది బాగా సరిపోతుంది. అయితే Windows అప్లికేషన్లకు సపోర్ట్ లేకపోవడం, భారీ మల్టీటాస్కింగ్‌కు అనుకూలం కాకపోవడం దీని పరిమితులు.

నాలుగో స్థానంలో Primebook 2 Pro (2026) నిలిచింది. 3.9/5 రేటింగ్‌తో వచ్చిన ఈ మోడల్‌ను Best Android Laptopగా చెప్పవచ్చు. 14 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ (కంపెనీ క్లెయిమ్), FHD IPS డిస్ప్లే, తక్కువ బరువు, బ్యాక్లిట్ కీబోర్డ్ వంటి ఫీచర్లు విద్యార్థులకు ఉపయోగపడతాయి. YouTube, OTT, ఆన్లైన్ క్లాసులు, డాక్యుమెంట్ ఎడిటింగ్, Android యాప్‌ల వినియోగానికి ఇది అనుకూలం. అయితే ఇది Windows ల్యాప్‌టాప్ కాదు. PrimeOS ఆధారంగా పనిచేస్తుంది కాబట్టి Coding లేదా Professional Office పనుల కోసం దీనిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదు.

ఈ జాబితాలో చివరి స్థానంలో Lenovo IdeaPad Slim 3 N4020 ఉంది. 3.6/5 రేటింగ్ పొందిన ఈ ల్యాప్‌టాప్‌లో Windows మరియు MS Office సపోర్ట్, Lenovo విశ్వసనీయత, రెండేళ్ల వారంటీ ఉన్నప్పటికీ Intel Celeron N4020 పాత ప్రాసెసర్ కావడం, కేవలం 4GB RAM ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ పనితీరు బలహీనంగా ఉంటుంది. సాధారణ బ్రౌజింగ్, MS Office, ఆన్లైన్ క్లాసుల వరకు మాత్రమే ఇది అనుకూలంగా ఉంటుంది. ఇదే బడ్జెట్లో Ryzen 3 ప్రాసెసర్ ఉన్న ల్యాప్‌టాప్ లభిస్తే అది మరింత మెరుగైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.

బడ్జెట్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసే ముందు మీ అవసరాలను స్పష్టంగా గుర్తించడం చాలా ముఖ్యం. Coding, Office, Professional పనుల కోసం Windows ల్యాప్‌టాప్‌లు ఉత్తమం. Google సేవలను ఎక్కువగా ఉపయోగించే వారికి Chromebook, Android యాప్‌ల వినియోగం మాత్రమే అవసరమైతే Primebook వంటి Android ల్యాప్‌టాప్‌లు సరిపోతాయి.
Also Read :
